‘విమానం’ నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా..’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల

‘విమానం’ నుంచి ‘సిన్నోడా ఓ సిన్నోడా..’ లిరికల్ సాంగ్ ప్రోమో విడుదల
Spread the love

తెలుగు, తమిళ భాషల్లో జూన్ 9 న చిత్రం విడుదల
తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోన్న వైవిధ్యమైన చిత్రం ‘విమానం’. విలక్ష‌ణ న‌టుడు స‌ముద్ర ఖ‌ని ఇందులో వీర‌య్య అనే మ‌ధ్య వ‌య‌స్కుడి తండ్రి పాత్ర‌లో న‌టించారు. ప్ర‌తీ తండ్రి త‌న కొడుకుని ఉన్నతంగా చూసుకోవాల‌ని అనుకుంటాడు. విమానం సినిమాలోనూ స‌ముద్ర ఖ‌ని అంగ వైకల్యంతో బాధ‌ప‌డుతున్న‌ప్ప‌టికీ, భార్య లేక‌పోయిన‌ప్పటికో కొడుకుని ప్రేమ‌గా పెంచుకుంటాడు. అలాంటి తండ్రీ కొడుకుల మ‌ధ్య ప్రేమానుబంధాన్ని గొప్ప‌గా ఆవిష్క‌రించేలా రూపొందిన పాట ‘సిన్నోడా ఓ సిన్నోడా..’. ఈ లిరికల్ సాంగ్ మే 2న రిలీజ్ కానుంది. అయితే సదరు పాటలోని ఎమోషన్స్ ఎలా ఉంటాయో చూపించేలా సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ ఆది వారం విడుదల చేసింది.
చిత్ర సంగీత దర్శకుడు చరణ్ అర్జున్ పాటను రాయటం విశేషం. ప్రముఖ సింగర్ మంగ్లీ పాటను తనదైన స్టైల్లో ఎంతో శ్రావ్యంగా ఆలపించిన‌ట్లు సాంగ్ ప్రోమో చూస్తే అర్థ‌మ‌వుతుంది.
జీ స్టూడియోస్‌, కిరణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్స్‌పై ఈ సినిమా రూపొందుతోంది. జూన్ 9న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ అవుతుంది. అలాగే చిత్ర నిర్మాత‌లు ఆడియెన్స్‌ను వారి తొలి విమాన ప్ర‌యాణానికి సంబంధించిన ఫొటోలు, వీడియోల‌ను #MyFirstVimanam కు ట్యాగ్ చేస్తూ @VimanamTheFilm అంటూ సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయాలని ఆహ్వానించిన సంగ‌తి తెలిసిందే. ఇందులో పాల్గొనే పార్టిసిపెంట్స్‌కు బ‌హుమతుల‌ను కూడా అందిస్తామ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

న‌టీన‌టులు: స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్
సాంకేతిక వ‌ర్గం: ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌
సినిమాటోగ్ర‌పీ: వివేక్ కాలేపు
ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌
మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌
ఆర్ట్‌: జె.జె.మూర్తి
డైలాగ్స్‌: హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)
లిరిక్స్ : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)
పి.ఆర్‌.ఒ: నాయుడు – ఫ‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (త‌మిళ్‌)
డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా

Related posts

Leave a Comment