గాలి ప్రత్యూష సమర్పణలో,శ్రీ శంకర ఆర్ట్స్ పతాకంపై యోగేశ్వర్, అతిధి జంటగా సాయి శివాజీ దర్శకత్వంలో, జివివి గిరి నిర్మించిన లవ్ అండ్ క్రైం కామెడీ ఎంటర్టైనర్ చిత్రం “పరారీ”..ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కు పాటలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 30న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం విడుదలైన అన్నీ థియేటర్స్ లలో విజయవంతంగా ప్రదర్శింప బడుతున్న సంధర్భంగా చిత్రయూనిట్ పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది..ఈ సందర్బంగా..
సీనియర్ నటులు సుమన్ మాట్లాడుతూ..ఎంతో కష్టపడి తీసిన నిర్మాత గిరి గారికి “పరారి” సినిమా హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి గురు, శుక్రవారం నాడు ఎంతో మంది హీరోలు ఇండస్ట్రీ కి పరిచయం అవుతుంటారు. అయితే యోగేష్ నటించిన పరారీ సినిమా బాగుంది. ఇందులో హీరో ఫైట్స్ పాటలు బాగా చేశాడు అనే కామెంట్స్ వచ్చాయి. రిలీజ్ అయిన ప్రతి చోట ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. మేము ఎక్స్పెక్ట్ చేసింది కూడా అంతే.. ఇక నుంచి తన టాలెంట్ తో ముందుకెళ్లాలని కోరుచున్నాను. ఇందులో నేను పోలీస్ ఆఫీసర్ గా మంచి పాత్రలో నటించాను.నాతో పాటు చాలా మంది సీనియర్స్ నటించడం విశేషం.ఈ చిత్ర నిర్మాత గిరి నాఅభిమాని అయినా ఖర్చుకు వెనుకాడకుండా చాలా బాగా నిర్మించాడు.సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, మ్యూజిక్ డైరెక్టర్ మహిత్ ఇలా అందరూ టెక్నిషియన్స్ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.ప్రేక్షకులకు కావాల్సిన అన్నీ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా ఫ్యామిలీ సినిమా.. తల్లిదండ్రులు పిల్లలు కలిసి ధైర్యంగా వెళ్లి చూసే విధంగా తెరకెక్కిన ఈ సినిమా లోని కామెడీని అందరు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. సస్పెన్సు థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “పరారీ” సినిమా చూసిన వారందరికీ కచ్చితంగా నచ్చుతుందని అన్నారు.
చిత్ర నిర్మాత గిరి మాట్లాడుతూ.. మార్చి 30 న రిలీజ్ అయిన మా సినిమాకు మంచి టాక్ వస్తుంది. చూసిన వారందరూ బోర్ కొట్టకుండా చాలాబాగా తీశారు. ఇందులో హీరో సాంగ్స్, యాక్షన్ ఫైట్స్ లలో బాగా చేశాడని చాలా మంది ఫోన్ చేయడం జరిగింది. సుమన్ గారు మాకు బ్యాక్ బోన్ గా ఉండి మాకు ఫుల్ సపోర్ట్ చేశారు, మరియు నటీ, నటులు టెక్నిషియన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేయడంతో సినిమా బాగా వచ్చింది.చాలా మంది ఈ సినిమా నాని గారి “దసరా”కు మా సినిమా పోటీ అంటున్నారు. ఆలా ఏం కాదు.ఆ సినిమా స్టోరీ వేరు, మా సినిమా స్టోరీ వేరు. నాకు రాముడు భక్తి ఎక్కువ అందుకే శ్రీరామ నవిమి రోజు రిలీజ్ చేయాలని చేశాము తప్ప పోటీ గా విడుదల చేయాలనే ఉద్దేశం లేదు. అలాగే డిస్ట్రిబ్యూటర్స్ కూడా సినిమా బాగుంది చెపుతున్నారు.అందుకే సోమవారం నుండి థియేటర్స్ కూడా పెంచుతున్నాము. కాబట్టి దయచేసి ప్రేక్షక దేవుళ్ళు ఇంకా మా సినిమా చూడని వారు ఉంటే థియేటర్కి వెళ్లి మా బాబు నటించిన “పరారీ” సినిమాను చూసి ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
హీరో యోగీశ్వర్ మాట్లాడుతూ… ఇది నా మొదటి చిత్రం. మా సినిమాని చూసిన వారందరూ చాలా బాగా చేశావని అందరూ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఇస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా మొదటి సినిమాలోనే మా గురువుగారు సుమన్, ఆలీ, జీవా, భూపాల్ వంటి సీనియర్ యాక్టర్స్ తో నటించడం చాలా హ్యాపీ గా ఉంది. వీరంతా నన్ను కొత్త వాడు అని చూడకుండా నాకు ఫుల్ సపోర్ట్ చేశారు.అలాగే వారి నుండి చాలా నేర్చుకొన్నాను. మా సినిమా టెక్నిషియన్స్ కు థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమాటోగ్రాఫర్ గరుడవేగ అంజి ఎక్సలెంట్ విజువల్స్ ఇచ్చారు. డైరెక్టర్ కూడా మంచి కథను రాసుకొని ఆ కథకు నన్ను సెలెక్ట్ చేసుకొన్నారు . మహిత్ నారాయణ్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఇలా ఈ సినిమాకు ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి పని చేశారు. వారందరికీ నా ధన్యవాదాలు.మా సినిమా చూసి నన్ను బ్లెస్స్ చేసిన ప్రేక్షక దేవుళ్ళకు నా ధన్యవాదాలు.ఇక ముందు కూడా మంచి కథలను సెలెక్ట్ చేసుకొని ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తానని అన్నారు
ఆమె డైరెక్టర్ మహిత్ నారాయణ్ మాట్లాడుతూ… ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ సినిమా బాగుందని చెపుతున్నారు. ఇందులోని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ముందు కూడా దర్శక, నిర్మాతలు ఇలాంటి మంచి సినిమాలు తియ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
ప్రొడ్యూసర్ ఫ్రెండ్ పవన్ మాట్లాడుతూ.. గిరి అన్నకు సపోర్ట్ గా నిలిచిన సుమన్ గారికి ధన్యవాదాలు. సినిమా బాగుందని విడుదలైన అన్ని చోట్ల నుండి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అందరూ ఇది దసరాకు పోటీ గా రిలీజ్ చేశారు అనే ప్రచారం జరిగింది. ఆది పూర్తిగా తప్పు మాకు అలాంటి ఉద్దేశ్యం లేదు. మా గిరి గారు శ్రీ రామ భక్తుడు అందుకే శ్రీ రామ నవిమి రోజు రిలీజ్ చెయ్యాలనుకోవడం వల్లే మా సినిమా రిలీజ్ చేశాము అన్నారు.
నటీ నటులు: యోగిశ్వర్, అతిధి, సుమన్, భూపాల్, శివాని సైని, రఘు కారుమంచి, మకరంద్ దేశముఖ్, షయాజి షిండే, అలీ , శ్రవణ్, కల్పాలత, జీవ తదితరులు.
సాంకేతిక నిపుణులు: నిర్మాత: జి వి వి గిరి, దర్శకత్వం: సాయి శివాజీ, సంగీతం మహిత్ నారాయణ్, లిరిక్ రైటర్స్: రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, సినిమాటోగ్రఫీ; గరుడ వేగా అంజి, ఎడిటర్ గౌతమ్ రాజు, ఆర్ట్స్; ఆనంద్, కోటి అబలయ్, యాక్షన్ :నందు, కొరియోగ్రఫీ: జానీ, భాను, పి. ఆర్. ఓ : సతీష్.కె.
PARARI MOVIE SUCCESS PRESSMEET