పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
దటీజ్… ప్రియదర్శన్!
Spread the love ఇలాంటి రికార్డ్ ప్రపంచంలోనే ఏ దర్శకుడికి వుండదు… వుండబోదు కూడా. 100 సినిమాలు తీసిన దర్శకులు చాలామందే వుంటారు.... -
శివానీ నాగరం : సింగర్ టర్నింగ్ యాక్టర్!
Spread the love ”కూచిపూడి, సంగీతం నేర్చుకున్నా. సింగర్ టర్నింగ్ యాక్టర్‌ని. ‘లిటిల్ హార్ట్స్’ చిన్న హమ్మింగ్ ఉంటుంది. ఆరంభం సినిమాలో ఓ... -
సారా అలీఖాన్ : విలక్షణమైన వ్యక్తిత్వం
Spread the love వారసత్వంతో బాలీవుడ్లో అడుగుపెట్టడం సులభమే కావొచ్చు, కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకోవడం...
