‘లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట..’ అంటూ పాటందుకున్న ‘డిజె టిల్లు’

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala's groovy dance number Tillu Anna DJ Pedithe
Spread the love

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా, నేహాశెట్టి నాయికగా టాలీవుడ్ లోని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘సితార ఎంటర్టైన్ మెంట్స్’ నిర్మిస్తున్న చిత్రం ‘డిజె టిల్లు’. ఈ చిత్రానికి సంభందించిన ఓ గీతం ఈ రోజు విడుదల అయింది. గాయకుడు రామ్ మిరియాల స్వయంగా ఆలపిస్తూ, స్వరాలు సమకూర్చిన ఈ గీతం విడుదల ఆయన క్షణం నుంచే చార్ట్ బస్టర్ లో దూసుకు వెళుతోంది. సామాజిక మాధ్యమాలలో సైతం స్పందన డీజే స్థాయిలో హోరెత్తుతోంది. పాట వివరాలు, విశేషాలలోకి వెళితే…..
“లాలాగూడా అంబర్ పేట మల్లేపల్లి మలక్ పేట
టిల్లు అన్న డీజే పెడితే డిల్లా డిల్లా ఆడాల
మల్లేశన్న దావత్ ల బన్ను గాని బారాత్ ల
టిల్లు అన్న దిగిండంటే డించక్ డించక్ దుంకాల” అనే ఈ పల్లవి గల గీతాన్ని గీతా రచయిత కాసర్ల శ్యామ్ రచించారు. ఈ గీతం గురించి ఆయన మాటల్లోనే…
హీరో క్యారెక్టరైజేషన్ చెప్పే ఒక పాట రాయాలని డైరెక్టర్ గారు చెప్పి, రామ్ మిరియాల ఇచ్చిన మంచి బీట్ ఉన్న ట్యూన్ పంపించారు…పక్కా హైదరాబాదీ రిదం తో ఉన్న ట్యూన్ వినగానే బాగా నచ్చింది.. హైదరాబాద్ గల్లీలల్లో ఒక రకమైన ఆటిట్యూడ్ తో ఉండే యంగ్ కుర్రాళ్ళు గుర్తొచ్చారు..ఏరియాల పేర్లతో పల్లవి ప్రారంభించి, హీరోపై మిగతా మిత్రులు, ఫ్యాన్స్ కోణంలో హుక్ లైన్ రాసా..తరువాత టీజర్ లో హీరో నటన,స్వాగ్ చూసాక చరణం అప్రయత్నంగా పలికింది… పాట ప్రోమోనే అద్భుతమైన వ్యూస్ రాబట్టుకుంది.. పాట అందరినీ ఆకట్టుకుంటుందని నమ్ముతున్నాను…
మంచి డాన్సింగ్ నంబర్ నా కలం లో నుండి రావడం,అందరి సెలెబ్రేషన్ లలో నేను ఒక భాగమవ్వడం సంతోషం గా ఉందని ఈ గీతం రచయిత కాసర్ల శ్యామ్ అంటున్నారు. భాను నృత్యరీతులు సమకూర్చారు ఈ గీతానికి.
ఇప్పటివరకు ఈ చిత్రానికి సంభందించి విడుదల అయిన ప్రచార చిత్రాలు, ఇటీవల విడుదల అయిన’డిజె టిల్లు’ టీజర్ కూడా పూర్తిగా యువతరాన్ని ఆకట్టుకున్నాయన్నది స్పష్టం. అటు టీజర్ లో దృశ్యాలు, సంభాషణలు ఇటు ఈ గీతంలోని నృత్యాలు ఆ విషయాన్ని స్పష్టం చేశాయి. జనవరి 14-2022 న విడుదల అవుతున్న ‘డిజె టిల్లు’ ప్రేక్షకుల్లోఆసక్తిని రేకెత్తిస్తోంది అనటంలో ఎంతమాత్రం సందేహం లేదు అనే విధంగా చిత్ర ప్రచారం ముమ్మరంగా జరుగుతోంది.
నూతన దర్శకుడువిమల్ కృష్ణ ఈ చిత్రానికి దర్శకుడు. కొత్త తరం రొమాంటిక్ ప్రేమకథా చిత్రమిది అంటున్నారు ఆయన .
చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ప్రిన్స్, బ్రహ్మాజీ, ప్రగతి, నర్రాశ్రీనివాస్ నటిస్తున్నారు.
రచన: విమల్ కృష్ణ, సిద్దు జొన్నలగడ్డ
మాటలు: సిద్దు జొన్నలగడ్డ
సంగీతం: శ్రీచరణ్ పాకాల
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడి సింగు
ఎగ్జక్యూటివ్ ప్రొడ్యూసర్: ధీరజ్ మొగిలి నేని
పి.ఆర్.ఓ: లక్ష్మీవేణుగోపాల్
సమర్పణ: పి. డి. వి. ప్రసాద్
నిర్మాత: సూర్యదేవర నాగవంశి
దర్శకత్వం: విమల్ కృష్ణ

Related posts

Leave a Comment