‘మెకానిక్’ మోషన్ పోస్టర్ విడుదల : ‘మెకానిక్’ మంచి విజయం సాధించాలి : ప్రముఖ నిర్మాత దిల్ రాజు

Dynamic Producer Dil Raju Released MECHANIC MOTION POSTER
Spread the love

మణి సాయి తేజ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న “మెకానిక్” చిత్రం మోషన్ పోస్టర్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. ఎంతో బిజీ షెడ్యూల్ లో ఉండి కూడా… తన విలువైన సమయాన్ని కేటాయించి… తమ “మెకానిక్” చిత్రం మోషన్ పోస్టర్ విడుదల చేసిన దిల్ రాజుకు దర్శకనిర్మాతలు కృతజ్ఞతలు తెలిపారు.
టేనా శ్రీ క్రియేషన్స్ పతాకంపై మున్నా (ఎమ్.నాగ మునెయ్య) నిర్మాతగా, కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి సహ నిర్మాతలుగా రూపొందుతున్న చిత్రం “మెకానిక్”. “ట్రబుల్ షూటర్” అన్నది ట్యాగ్ లైన్. ఈ చిత్రం ద్వారా “ముని సహేకర” దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో గ్రామీణ ప్రాంతంలో జరిగే ఒక బర్నింగ్ ప్రాబ్లం నేపథ్యంలో… వినోదానికి పెద్ద పీట వేస్తూ సందేశాత్మకంగా తెరకెక్కుతోంది. మణి సాయి తేజ సరసన రేఖ నిరోషా హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటూ విడుదలకు సిద్ధమవుతోంది.
తనికెళ్ల భరణి, నాగ మహేష్, సూర్య, ఛత్రపతి శేఖర్, సంధ్యా జనక్, సునీత మనోహర్, సమ్మెట గాంధీ, వీరశంకర్, ల్యాబ్ శరత్, మాస్టర్ చక్రి, జబర్దస్త్ ఫణి, జబర్దస్త్ దొరబాబు, కిరీటి దామరాజు, బిందాస్ భాస్కర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: ధీరజ్-అప్పాజీ, సంగీతం: వినోద్ యాజమాన్య, సింగర్స్: సిడ్ శ్రీరామ్, కైలాష్ ఖేర్, ఛాయాగ్రహణం: ఎస్.వి.శివరాం, ఎడిటర్: శివ శర్వాణి, సాహిత్యం: ముని సహేకర – ఎమ్.ఎన్.సింహ, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: గణేష్ మాస్టర్ – కపిల్ మాస్టర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: శ్రీనివాసరావు బండి, కో-డైరెక్టర్: తోట శ్రీకాంత్, సహ నిర్మాతలు: కొండ్రాసి ఉపేందర్ – నందిపాటి శ్రీధర్ రెడ్డి, నిర్మాత: మున్నా (ఎమ్.నాగ మునెయ్య) కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: ముని సహేకర!!

mechanic motion poster Relese

Video link

Filename
mechanic motion poster

Related posts

Leave a Comment