మలినేని గోపీచంద్ సినిమాలో బాల‌య్య 60 ఏళ్ల వృద్ధుడిగా కనిపించబోతున్నారా?

NBK-Malineni Gopichand
Spread the love

నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ సాధించిన కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిసింది. దాంతో ఇప్పుడు ఎవ్వరినోటా విన్నా బాలయ్య జపమే! యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం ‘అఖండ’ సినిమా స‌క్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నవిషయం తెలిసిందే. ‘అఖండ’ ఎవ్వ‌రూ ఊహించ‌ని విధంగా వ‌సూళ్లు రాబ‌ట్ట‌డంతో పాటు విజయవంతంగా 50 రోజులు 103 థియేటర్లలో పూర్తిచేసుకుంది. అస‌లు ఇప్పుడు ఉన్న ఈ క్లిష్ట ప‌రిస్థితుల్లో ఓ సినిమాకు లాంగ్ ర‌న్ ఉండ‌డం లేదు. అలాంటిది ‘అఖండ’ ఏకంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో 50కు పైగా కేంద్రాల్లో 50 రోజులు పూర్తిచేసుకోవడమంటే మాటలు కాదు. . మ‌రోవైపు బుల్లితెర‌పై అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్బీకే షోతో అక్క‌డ కూడా బాల‌య్య షేక్ చేస్తున్నాడు.
ఇదే ఊపులో బాల‌య్య వ‌రుస పెట్టి సినిమాలు అంగీక‌రిస్తున్నాడు. ఆయన తదుపరి చిత్రం మ‌లినేని గోపీచంద్ ద‌ర్వ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. మైత్రీ మూవీస్ బ్యానర్ పై భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత అనిల్ రావిపూడితో మ‌రో సినిమా రానుంది. ఇలా బాల‌య్య లైన‌ప్‌లో అంద‌రూ క్రేజీ డైరెక్ట‌ర్లే ఉన్నారు. ఇదిలా ఉంటే బాల‌య్య – గోపీచంద్ ద‌ర్శ‌కత్వంలో తెర‌కెక్కే సినిమా స్టోరీ లైన్ ఇదేనంటూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ఓ లైన్ విశేషంగా చ‌క్కర్లు కొడుతోంది. ‘బాల‌య్య – గోపీచంద్ సినిమా స్టోరీ లైన్ ఇదే…? టైటిల్ కూడా ఫిక్స్’ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పెడుతున్న పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ లైన్ ప్ర‌కారం ఈ సినిమాలో బాల‌య్య ద్విపాత్రాభినయం చేస్తున్నారట. ఒక రోల్ యంగ్ రోల్‌.. రెండో రోల్లో బాల‌య్య 60 ఏళ్ల వృద్ధుడిగా క‌నిపించ‌నున్నాడ‌ట‌. వృద్ధుడు పాత్ర‌ను పోషిస్తోన్న బాల‌య్య‌ను రాయ‌ల‌సీమ జ‌నాలు పెద్దాయ‌న‌గా పిలుచుకుంటార‌ట‌. ఇక బాల‌య్య స‌ర‌స‌న శృతీహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో విల‌న్‌గా దునియా విజ‌య్‌ న‌టిస్తున్నాడు. సీమ ప్రాంతంలో ప‌రిశ్ర‌మ‌లు పెడితే అక్క‌డ ల‌క్ష‌లాది మందికి ఉపాధి దొరుకుతుంది.. ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది.. అయితే అక్క‌డ కొంద‌రు వ్య‌క్తుల‌తో పాటు కొన్ని స‌మ‌స్య‌ల వ‌ల్ల అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు అన్ని ప‌రిస్థితులు అనుకూలంగా ఉన్నా కూడా పారిశ్రామిక వేత్త‌లు ముందుకు రారు ? ఇందుకు కార‌ణం ఏంటి ? బాల‌య్య ఈ స‌మ‌స్య‌ల‌కు ఎలా చెక్ పెట్టి ? అక్క‌డ ప‌రిశ్ర‌మ‌లు ఏర్పాటు చేసి ప్ర‌జ‌ల గుండెల్లో దేవుడుగా నిలిచిపోయాడు ? అన్న‌దే ఈ సినిమా మెయిన్ లైన్‌గా సాగనున్నట్టు తెలిసింది. ఇక కోలీవుడ్ హీరోయిన్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కూడా నెగిటివ్ ట‌చ్ ఉన్న మ‌హిళా విల‌న్‌గా క‌నిపించ‌బోతోంద‌ని అంటున్నారు. మైత్రీ మూవీస్ వారు ఎక్క‌డా కాంప్రమైజ్ కాకుండా భారీ బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వ‌ర‌లోనే ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇక ఈ సినిమాకు ‘వేట‌పాలెం’ అనే టైటిల్ ప‌రిశీలిస్తున్న‌ట్టు ప్ర‌చారం ఉంది.

Related posts

Leave a Comment