మలయాళం సూపర్ హిట్ సినిమా ‘2018’ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న ప్రముఖ నిర్మాత బన్నీ వాసు?

Passionate Producer Bunny Vas Releasing the Malayalam Blockbuster "2018 - Everyone is a Hero" in Telugu
Spread the love

ప్రస్తుతం ఆడియన్స్ కి భాషతో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్న కూడా చూడటం అలవాటు అయిపోయింది. రీసెంట్ టైమ్స్ లో క్రిస్టి, ఇరట్ట, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్ గా మే 5 న విడుదలైన మలయాళం సినిమా “2018”. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ టాక్ తో ముందుకు సాగుతూ బీభత్సమైన కలక్షన్స్ ను రాబడుతుంది.
ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే. కానీ అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్ తోనే పదిరోజుల్లో వంద కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. “2018” ఆగస్టు నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన,
కేరళలో 2018 లో అధిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే.
ఇందులో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని “జూడ్ ఆంథనీ జోసెఫ్” ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు.
కేరళ లోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది.
దొంగ మెడికల్ సర్టిఫికెట్తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా “టోవినో థామస్” అనూప్ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్,వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో మనకు కనిపిస్తారు.
ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత “బన్నీ వాసు” రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది, అలానే నైజం ఏరియాలో విడుదల చేస్తునట్టు తెలిసింది. ఈ సినిమా తెలుగు రిలీజ్ హక్కులను “బన్నీ వాసు” దక్కించుకున్నట్లు సమాచారం.

Related posts

Leave a Comment