బహు భాషా చిత్రం “భారతీయన్స్” హీరో “నీరోజ్ పుచ్చా”కు ప్రపంచ ప్రఖ్యాత క్రికెటర్ “ఎ.బి.డివిలియర్స్” ప్రశంసలు!!

Renowned Cricketer AB De villiers appreciate Bharateeyans Hero Nerroze Putcha!!
Spread the love

తెలుగు – హిందీ భాషల్లో నేరుగా తెరకెక్కి… ప్రధాన భారతీయ భాషలన్నిటిలో అనువాదం కానున్న బహు భాషా దేశభక్తి చిత్రం “భారతీయన్స్” టీజర్ ను ప్రపంచ ప్రఖ్యాత దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎబి డివిలియర్స్ ప్రశంసించారు. ప్రస్తుతం ఈయన ఐపిఎల్ – ఆర్.సి.బి టీమ్ లో ఉన్నారు. ఈ చిత్ర కథానాయకుల్లో ఒకరిగా పరిచయమవుతున్న “నీరోజ్ పుచ్చా”కు ఉజ్వలమైన భవిష్యత్ ఉందని డివిలియర్స్ పేర్కొన్నారు. కోట్లాది క్రికెట్ ప్రేమికుల ఆదరాభిమానాలు కలిగిన డివిలియర్స్ తన సినిమా టీజర్ ను మెచ్చుకోవడం, తనను అభినందించడం పట్ల నీరోజ్ పుచ్చా ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు. జీవితాంతం డివిలియర్స్ ను గుర్తుంచుకుంటానని, ఆయన గర్వపడే స్థాయికి చేరుకోవడానికి కృషి చేస్తానని నీరోజ్ పేర్కొన్నారు. “భారతీయన్స్” చిత్రంతో తనను హీరోగా పరిచయం చేస్తున్న నిర్మాత శంకర్ నాయుడు, దర్శకుడు దీన్ రాజ్ లకు జీవితాంతం రుణ పడి ఉంటానని నీరోజ్ అన్నారు!!
నీరోజ్ పుచ్చా, సోనమ్ టెండప్, సుభా రంజన్ హీరోలుగా… సమైరా సందు, రాజేశ్వరి చక్రవర్తి, పెడెన్ నాంగ్యాల్ హీరోయిన్లుగా నటించిన బహు భాషా చిత్రం ‘భారతీయన్స్’. భారత్ అమెరికన్ క్రియేషన్స్ పతాకంపై ప్రవాస భారతీయుడు డాక్టర్ శంకర్ నాయుడు అడుసుమిల్లి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రముఖ రచయిత – ప్రేమకథా చిత్రాల స్పెషలిస్ట్ దీన్ రాజ్ (ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా” ఫేమ్) ఈ దేశభక్తి చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎమ్.వెంకయ్య నాయుడు, కశ్మీర్ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటి పలువురు ప్రముఖుల ప్రశంసలు దండిగా పొంది, అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది!!

Related posts

Leave a Comment