దిల్ రాజు సారథ్యంలో శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్, హన్షిత నిర్మించిన సినిమా ‘బలగం’. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని వేణు ఎల్దండి తెరకెక్కించారు. మార్చి 3న విడుదలైన చిత్రం సూపర్ డూపర్ సక్సెస్ టాక్‌తో ప్రేక్షకుల ఆదరాభిమానాలను పొందుతుంది. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం సినిమాను అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమా సక్సెస్‌పై ప్రియదర్శి మీడియాతో మాట్లాడిన ఇంటర్వ్యూ విశేషాలు…
– ‘బలగం’ సినిమా చూసిన నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ‘మల్లేశం’ వంటి మూవీ తర్వాత మరో మంచి సినిమా చేశావని అందరూ అప్రిషియేట్ చేశారు.
– చాలా మంది రెండు, మూడు సార్లు చూసిన వాళ్లు ‘బలగం’ ఓ గొప్ప సినిమా అని అన్నారు. థియేటర్స్‌లో ఏడ్చినప్పటికీ సంతోషంగా బయటకు వస్తున్నారు. విన్సెంట్ అనే నా ఫ్రెండ్ అయితే సినిమా చూసి తన గత జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుని ఏడ్చి రిలీఫ్‌గా ఫీల్ అయ్యాడు. ఇలాంటివన్నీ వింటుంటే మనకు చిన్నప్పుడు వేమన పద్యాలు, ఏమైనా మంచి మాటలు వినప్పుడు కొత్తగా ఏమైనా చేయాలనే ఐడిలిజం ఫీలింగ్ వస్తుంటుంది. అలాంటి ఫీలింగ్సే.. ‘బలగం’ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే కలుగుతుందని ఆడియెన్స్ అంటున్నారు. మనిషిని లోలోతుగా కదిలించిన సినిమా అంటునారు.
– మానాన్నగారు లెక్చరర్ ఆయన ఉగ్గు కథలు వంటి ప్రోగ్రామ్స్‌కి నన్ను తీసుకెళుతుండేవారు. ఉగ్గు కళాకారులు ఎలా ఉంటారంటే ఆగకుండా రోజంతా కూడా కథలు చెప్పగలరు. అలాంటి టాలెంట్ ఉన్న వేణుగారు, రమేష్‌గారిని చూడగానే వీళ్లు మామూలు వాళ్లు కాదనిపించింది. ఈ సినిమాతో ఆయనేం చెబుతాడో అనే క్యూరియాసిటీ ఉండింది. ఏదో కామెడీ కథ అవుతుందని అనుకున్నాను.
– బలగం సినిమా స్టార్టింగ్‌లో నేను కూడా ఎంజాయ్ చేశాను. అప్పటికింకా బుడగ జంగం దేవర పాట రాలేదు. పాట యాడ్ చేసిన తర్వాత ఇంకా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. దిల్‌రాజురి బ్యానర్ హర్షిత్, హన్షిత నిర్మాతలు అనగానే చాలా హ్యాపీగా అనిపించింది.
– మానాన్నగారు యూనివర్సిటీలో రీసెర్చ్ డిపార్ట్‌మెంట్‌లో వర్క్‌చేస్తుండేవారు అప్పుడు కొమరెల్లి మల్లన్న జాత కథను సంకిలతం చేసి దాన్ని ఒక పుసక్తంగా తీసుకొచ్చి డిపార్ట్‌మెంట్ ఆప్ కల్చరల్ ప్రాజెక్ట్‌లో ఇస్తుండేవారు. అప్పుడాయనకు నేను కొన్ని వీడియోలను ఎడిట్ చేసి ఇస్తుండేవాడిని. అలాగే చుక్కా సత్తయ్య ఉగ్గుకథలను వింటూ పెరిగాను.
– నేను గడ్డం సతీష్‌గారి కథను చదవలేదు. అందులో పిట్ట ముట్టడం అనే పాయింట్ ఉందని చూసిన వాళ్లు అంటున్నారు. కానీ ఆ మూల కథకు మాకు సంబంధం లేదు. రెండింటినీ పోల్చి చూస్తే అందరికీ అర్థమవుతుంది. పిట్ట ముట్టడం అనేది తరతరాలు మన దగ్గరున్న అంశం. దాన్ని మూల కథ అని అంటే నేను ఒప్పుకోను. ఎవరికీ దానిపై హక్కు లేదు.
– నెక్ట్స్ నేను హాట్ స్టార్‌లో సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ చేశాను. మహి వి.రాఘవ్ తెరకెక్కించారు. ఇది సీరియస్ మూవీ కాదు.. ఔట్ అండ్ ఔట్ కామెడీ మూవీ. తర్వాత సుయోధన అనే మరో సినిమాలోనూ నటిస్తున్నాను. ఇదొక క్రైమ్ డ్రామా. కొన్ని రోజులు మాత్రమే షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. అలాగే శఠగోపం మూవీ, నాని 30లో నటిస్తున్నాను. ఇవన్నీ కాకుండా 35 అనే ఇండిపెండెంట్ మూవీ చేస్తున్నాను.