మారిన ‘బుట్ట బొమ్మ’ విడుదల తేదీ
గతేడాది డీజే టిల్లు, ఈ ఏడాది ‘బుట్ట బొమ్మ’
ఆలస్యాన్ని మరిపించేలా వినోదం
కాస్త ఆలస్యంగా వచ్చినా ఆ ఆలస్యాన్ని మరిపించేలా వినోదాన్ని అందిస్తామని, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ‘బుట్టబొమ్మ’ సినిమా ఉంటుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా చెబుతున్నారు. అయితే జనవరి 26న విడుదల కావాల్సిన ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు చిత్ర బృందం అధికారికంగా ప్రచార చిత్రాన్ని కూడా విడుదల చేసింది.
ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రూరల్ డ్రామా ‘బుట్ట బొమ్మ’. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరచయమవుతున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికే నటుడు అర్జున్ దాస్ ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని ఇస్తుందని చెప్పారు. నాయిక అనిఖా సురేంద్రన్ సైతం ఈ సినిమా కలర్ ఫుల్ గా, అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని అన్నారు.
ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించిన సితార ఎంటర్టైన్మెంట్స్ గతేడాది ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ తో కలిసి ‘డీజే టిల్లు’ చిత్రాన్ని నిర్మించింది. 2022 ఫిబ్రవరిలో విడుదలైన డీజే టిల్లు చిన్న సినిమాగా వచ్చి సంచలన విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో వస్తున్న ‘బుట్టబొమ్మ’ కూడా ఆ విజయాన్ని పునరావృతం చేస్తుందని చిత్ర నిర్మాతలు నమ్మకంగా ఉన్నారు.
సాంకేతిక వర్గం:
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
సంభాషణలు: గణేష్ కుమార్ రావూరి
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: వివేక్ అన్నామలై
ప్రొడక్షన్ కంట్రోలర్: సిహెచ్ రామకృష్ణా రెడ్డి
పీఆర్ఓ: లక్ష్మి వేణుగోపాల్
నిర్మాతలు: ఎస్ నాగవంశీ, సాయి సౌజన్య
దర్శకత్వం: శౌరి చంద్రశేఖర్ రమేష్