పోస్టర్ : యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్!

poster movie telugu review
Spread the love
  • చిత్రం : పోస్టర్
  • విడుదల : 19 నవంబర్ -2021
  • రేటింగ్ : 4/5
  • తారాగణం :
  • విజయ్ ధరన్, రాశి సింగ్,
  • అక్షత సోనావానే, శివాజీ రాజా,
  • మధుమణి, కాశి విశ్వనాధ్,
  • రామరాజు, తదితరులు.
  • ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్
  • కెమెరా : రాహుల్
  • సంగీతం శాండీ అద్దంకి
  • నిర్మాతలు : టి మహిపాల్ రెడ్డి, ట్ శేఖర్ రెడ్డి, ఏ గంగా రెడ్డి, ఐ జి రెడ్డి.
  • రచన – దర్శకత్వం : టి ఎమ్ ఆర్

తెలుగు చిత్ర పరిశ్రమకు ‘పోస్టర్’కు అవినాభావ సంబంధం ఉంది. అంతెందుకు ‘పోస్టర్’ లేనిదే సినిమా లేదు. జనాల్లోకి తీసుకెళ్లే ఇంత చక్కటి ‘పోస్టర్’నే టైటిల్ గా పెట్టుకొని టి. మహిపాల్ రెడ్డి దర్శకత్వంలో విజయ్ ధరన్, రాశి సింగ్, అక్షత సోనావానే హీరో హీరోయిన్స్ గా, ప్రముఖ నటీనటులు శివాజీరాజా, మధుమణి, రామరాజు, కాశీ విశ్వనాధ్ లు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మీద విడుదలకు ముందే యూత్ అండ్ ఫ్యామిలీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఏర్పడ్డాయి. ఈ ‘పోస్టర్’ ఎన్నో ఆశలతో శుక్రవారం,నవంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. మరి ఈ సినిమా అంచనాలను అందుకుందో.. లేదో.. తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లాల్సిందే..

కథేమిటంటే… సిద్దిపేట లో మొదలయ్యే ఈ కథలో, హీరో శ్రీను ఆవారా గా తిరుగుతూ ఫ్రెండ్స్ తో లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. తన తండ్రి పనిచేస్తున్న ఒక థియేటర్ ఓనర్ అయిన పెద్దారెడ్డి కూతురుతో మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు శ్రీను, అది తెలుసుకోలేని పెద్దారెడ్డి శ్రీను గట్స్ నచ్చి తన దగ్గరే పనిలో పెట్టుకొని శ్రీను తో సెటిల్మెంట్స్ చేయిస్తూ ఉంటాడు. శ్రీను అండ్ తన కూతురు ప్రేమలో ఉన్నారని తెలుసుకున్న పెద్దారెడ్డి తన మనుషులతో శ్రీను ఇంటికి వచ్చి, శ్రీను ఇంటి పరువు తీసి శ్రీను తన తల్లిదండ్రుల ముందు అండ్ ఊరి జనాభా ముందు బాగా కొట్టడంతో.. అది అవమానంగా ఫీల్ అయిన రామస్వామి తన కొడుకుని ఇంటి నుండి బయటకు గెంటేస్తాడు. ఆ తరువాత శ్రీను లైఫ్ ఎలా టర్న్ తీసుకుంది, శ్రీను చేసిన సెటిల్మెంట్ వల్ల శ్రీను తెలుసుకుంది ఏంటి.? సెకండ్ హాఫ్ లో వచ్చే తులసి (రాశి సింగ్) పాత్ర ఏంటి.? మరి మేఘన తో శ్రీను ప్రేమకథ ఎందుకు ఫెయిల్ అయింది.? జీరో లాగా ఇంటి నుండి బయటకు వెళ్లిన శ్రీను తిరిగి తన ఊరికి హీరోలా ఎలా వచ్చాడు అనేది మిగతా కథ.” ఆ కథ మీరు స్క్రిన్ మీదనే చూడాల్సిందే!

విశ్లేషణ : ఈ సినిమాలో ముందుగా మాట్లాడుకోవాల్సింది కథ గురించే. అన్ని రకాల ప్రేక్షకులకి కనెక్ట్ అయ్యే కథ ను రాసుకొని డైరెక్టర్ ముందే హిట్టు కొట్టేసారు. కథను ముందే ఎక్కడా ఓపెన్ చేయకుండా యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో నెక్స్ట్ లెవెల్ కామెడీ ని చూపిస్తూ హాల్ లో కూర్చున్న ప్రేక్షకులను ఫస్ట్ హాఫ్ లో బాగా నవ్వించారు. తండ్రి కొడుకుల బాండింగ్, కొడుకు భవిష్యత్తు కోసం తండ్రి పడే తపన, విలేజ్ నేటివిటీ లవ్ డ్రామా, ఫస్ట్ హాఫ్ లో సాంగ్స్, టీనేజ్ కుర్రాళ్లకు బాగా నచ్చే లవ్ స్టోరీ ఇవన్నీ కూడా ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్. ఇంటర్వెల్ పార్ట్ ఈ సినిమాకు హైలెట్ అవుతుంది, అలానే ఫ్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ లు అయితే సినిమాకు ప్రాణం పోశాయి. జెనరల్ గా విలేజ్ బ్యాక్డ్రాప్ టు సిటీ బ్యాక్డ్రాప్ కథలు ఎప్పుడూ మనకు ఎంటర్టైన్మెంట్ ని ఇచ్చే విధంగానే ఉంటాయి. ఆ సినిమాల లిస్ట్ లో ఈ పోస్టర్ సినిమా కూడా చేరింది.

ఎవరెలా చేశారంటే.. రామస్వామి క్యారక్టర్ ప్లే చేసిన శివాజీ రాజా ఇరగదీశాడు. తన అద్భుతమైన నటన తో కొడుకు భవిష్యత్తు కోసం మనోవేధన చెందే ఒక మాములు మిడిల్ క్లాస్ తండ్రిగా శివాజీ రాజా నటన మాత్రం ఈ సినిమాకు హైలెట్. అలానే తల్లిగా నటించిన మధుమణి కూడా తన నేచురల్ నటన తో చాలా చోట్ల ప్రేక్షకులను కట్టిపడేసారు. పెద్దిరెడ్డి గా నటించిన రామరాజు కూడా విలనిజం షేడ్స్ అండ్ థియేటర్ ఓనర్ గా బాగా ఆకట్టుకున్నారు. హీరో ఫ్రెండ్స్ గా నటించి బాగా కామెడీ పండించిన రవీందర్ నటన కూడా చాలా బాగుంది. ఇక హీరో హీరోయిన్స్ విషయానికి వస్తే, శ్రీను గా నటించిన టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ ధరన్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో ఈ సినిమాను మరో మెట్టు ఎక్కించారు, టాలీవుడ్ లో మంచి గుర్తింపు ఉన్న హీరోలలో ఒకరు అయ్యే లక్షణాలు విజయ్ కి పుష్కలంగా ఉన్నాయి. సెకండ్ హాఫ్ లో విజయ్ ధరన్ యాక్టింగ్ సినిమా ఇండస్ట్రీ హీరో లకి చాలా దగ్గరగా అనిపిచ్చింది. అలానే రాశి సింగ్ చూడటానికి పక్కింటి అమ్మాయి లా కనిపించిన రాశి కూడా తన నటనతో సినిమాకు ప్రాణం పోసింది. అలానే ఇంకో హీరోయిన్ అక్షత సోనావానే అటు గ్లామర్ గాళ్ అండ్ మోడ్రన్ విలేజ్ అమ్మాయి లుక్ లో కుర్రకారుని బాగా అలరించింది.


సాంకేతికత విషయానికొస్తే… ప్రధానంగా ఎడిటర్ మార్తాండ కె వెంకటేష్ గురించి చెప్పుకోవాలి. తన ఎడిటింగ్ తో ఇటువంటి ఒక వైవిధ్యమైన సినిమాను ఎక్కడా బోర్ ఫీల్ కలగకుండా చేసారు. అలానే కెమెరా మ్యాన్ రాహుల్ కూడా డైరెక్టర్ చెప్పాలనుకున్న కథతో బాగా ట్రావెల్ అయి సినిమాను కళ్ళకు కట్టినట్టు అందంగా చూపించారు. ఇక సంగీతం అందించిన శాండీ అద్దంకి మనకు సినిమా రిలీజ్ కంటే ముందే తన సాంగ్స్ తో బాగా ఆకట్టుకున్నారు, సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నెక్స్ట్ లెవెల్ లో అందించి తన మార్క్ చూపించారు. నిర్మాణ విలువలు ఎంతో ఉన్నతంగా బాగున్నాయి, నిర్మాతలు దర్శకుడికి పూర్తి స్థాయి స్వేచ్ఛను ఇచ్చి సినిమాను చాలా రిచ్ గా తెరకెక్కించారు అని అర్ధమవుతుంది. ఇక డైరెక్టర్ టి ఎమ్ ఆర్ గురించి చెప్పుకోవాలి అంటే తన మొదటి సినిమా అయినప్పటికీ కథను కరక్ట్ గా అన్ని రకాల ప్రేక్షకులకి కావాల్సిన ఎలిమెంట్స్ తో బాగా రాసుకొని సినిమాను డైరెక్ట్ చేసిన విధానమే ఈరోజు ఈ సినిమాను హిట్టు చేసింది. భారీ ప్యాడింగ్ ని పెట్టుకొని కొత్త దర్శకుడు మొదటి సినిమాతో సూపర్ హిట్టు సక్సెస్ అందుకోవడం అంటే మాములు విషయం కాదు. డైరెక్టర్ టి ఎమ్ ఆర్ చెప్పాలనుకున్న కథకు, అంతర్లీనంగా ప్రస్తుత సమాజంలో అందరికి కావాల్సిన ఒక మెస్సేజ్ ని చాలా చక్కగా వివరించారు. జీరో తో హీరో అయ్యే కూడా కథ అని చెప్తూ ఈ కథకు ఫైనల్ గా తానే హీరో అయి విలన్స్ అంటే మన చుట్టూ వుండే సమస్యలు మాత్రమే, వాటిని ఎదురుకోవడం తెలిస్తే ప్రతి ఒక్కరి జీవితం మా పోస్టర్ సినిమా లా సూపర్ హిట్టు అవుతుంది అని అనిపించేలా ఈ సినిమాను తెరకెక్కించడం చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ ను ఫుల్ లెన్త్ కామెడీ తో అండ్ ఒక బ్యూటిఫుల్ లవ్ ట్రాక్ తో నడిపి సెకండ్ హాఫ్ లో తను చెప్పాలనుకున్న కథను క్లుప్తంగా చెప్పారు. మొత్తం మీద ఈ ‘పోస్టర్’ యూత్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా అలరించింది.


by -దిల్

Related posts

Leave a Comment