‘పుష్ప ది రైజ్’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోందా?!

pushpa || Telugu Movie
Spread the love

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ బడ్జెట్ చిత్రం ‘పుష్ప ది రైజ్’ భారీ అంచనాల మధ్య డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో కూడా మంచి వసూళ్ళతో దూసుకుపోతోంది. అయితే సినిమా పరంగా కాకుండా ఈ సినిమాలో ఐకాన్ స్టార్ నటనకి మాత్రం ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోతున్నారు. పుష్ప రాజ్ గా ఐకాన్ స్టార్ చేసిన నటన వీరలెవెల్లో ఉందంటున్నారు. మరి అల్లు అర్జున్ నటనపై ఇప్పుడు సెన్సేషనల్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఓ రేంజ్ లో తన ఆనందంతో బన్నీని ఎలివేట్ చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ఒక హైపర్ సోనిక్ మిస్సైల్ కన్నా తక్కువ కాదని, ప్రతి ఒకరూ పుష్ప సినిమా చూడండి అంటూనే , అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ ని తనివితీరా చూసి అభినందిస్తారు అని మూవీ హిస్టరీ లోనే తనది ఒక బెస్ట్ పెర్ఫామెన్స్ అని ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా.. ఈ భారీ పాన్ ఇండియన్ సినిమా ‘పుష్ప ది రైజ్’ నైజాంలో అదిరే వసూళ్లు రాబడుతోందిట. బాక్సాఫీస్ వద్ద తొలిరోజు నుంచే భారీ వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. మొదటి మూడు రోజులు వీకెండ్ లో సాలిడ్ వసూళ్లు అందుకున్న ఈ చిత్రం సోమవారం వర్కింగ్ డే రోజు సాధించిన వసూళ్లు అంతా ఇంతా కాదు. ఇది ఆసక్తిగా మారింది. నైజాం లో నాలుగో రోజు ఈ చిత్రం 3.45 కోట్ల షేర్ ని రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వర్కింగ్ డే లో ఇది పెద్ద మొత్తం అని చెప్పాలి. ఇక దీనితో నైజాం లో మొత్తం నాలుగు రోజులకి కలిపి 26.5 కోట్ల షేర్ వచ్చిందట. బయ్యర్లు కూడా లాభాల్లోకి వెళుతున్నారని సమాచారం. మొత్తానికి నైజాంలో ‘పుష్ప’కు 4 రోజులకు 26.5 కోట్ల షేర్ రావడంతో సినీవర్గాలు ‘పుష్ప ది రైజ్’ బాక్సాఫీస్ ని షేక్ చేస్తోందంటున్నారు!!

Related posts

Leave a Comment