మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర)ల క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులకు, ప్రేక్షకులకు థియేటర్లలో పూనకాలు తెప్పించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే వాల్తేరు వీరయ్య ప్రమోషనల్ కంటెంట్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. చిరంజీవి టీజర్, రవితేజ టీజర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. బాస్ పార్టీ సాంగ్ 28 మిలియన్ల వ్యూస్ ని క్రాస్ చేసి రీల్ మేకర్స్ కు ఫేవరెట్ గా మారింది. ఇప్పుడు సెకండ్ సింగిల్ ‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ మేకర్స్ విడుదల చేశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ లీడ్ పెయిర్ అందమైన కెమిస్ట్రీని వర్ణిస్తూ పాటను స్వయంగా రాసి అవుట్ స్టాండింగ్ గా కంపోజ్ చేశారు. జస్‌ప్రీత్ జాస్ , సమీరా భరద్వాజ్‌ల డైనమిక్ వోకల్స్ తో ఎనర్జీని డబుల్ చేశారు. ఈ పాట ఆడియన్స్ మెస్మరైజ్ చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి తన గ్రేస్ ఫుల్ డ్యాన్స్‌తో పాటను మరో స్థాయికి తీసుకెళ్లారు. చిరంజీవి బ్లేజర్లు ధరించి స్టైలిష్‌గా ఉన్నారు. శృతి హాసన్ రంగురంగుల చీరలలో అద్భుతంగా ఉంది. వారి జంట చూడముచ్చటగా వుంది. మంచుతో కప్పబడిన లొకేషన్ మరొక హైలైట్. ‘మౌత్ ఆర్గాన్ స్టెప్’ సిగ్నేచర్ పాటకు మరో ఆకర్షణ. రాబోయే రోజుల్లో రీల్ మేకర్స్ కి ఇది ఫేవరెట్ అవుతుంది. శేఖర్ మాస్టర్ ఈ పాటకు డ్యాన్స్‌లు సమకూర్చారు. ఈ సినిమా షూటింగ్ యూరప్‌లో పూర్తి చేసుకొని చిరంజీవి హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. వాల్తేరు వీరయ్య జనవరి 13, 2023న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జికె మోహన్ సహ నిర్మాత. ఆర్థర్ ఎ విల్సన్ కెమెరామెన్ గా, నిరంజన్ దేవరమానె ఎడిటర్‌గా, ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా పని చేస్తున్న ఈ చిత్రానికి సుష్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనర్. ఈ చిత్రానికి బాబీ కథ, మాటలు రాయగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. రైటింగ్ డిపార్ట్‌మెంట్‌లో హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి కూడా పనిచేస్తున్నారు.
నటీనటులు: చిరంజీవి, రవితేజ, శృతి హాసన్ తదితరులు.
సాంకేతిక విభాగం: కథ, మాటలు, దర్శకత్వం: కేఎస్ రవీంద్ర (బాబీ కొల్లి), నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్, బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్, సంగీతం: దేవి శ్రీ ప్రసాద్, డీవోపీ: ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సహ నిర్మాతలు: జీకే మోహన్, ప్రవీణ్ ఎం, స్క్రీన్ ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి, ఎడిషినల్ రైటింగ్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి, సిఈవో: చెర్రీ, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి, పీఆర్వో: వంశీ-శేఖర్, పబ్లిసిటీ: బాబా సాయి కుమార్, మార్కెటింగ్: ఫస్ట్ షో
‘నువ్వు శ్రీదేవి నేను చిరంజీవి’ అంటున్న ‘వాల్తేరు వీరయ్య’
