నంద‌మూరి బాల‌కృష్ణ‌ # NBK107లో వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌

Varalakshmi-Sharathkumar
Spread the love

‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత న‌టిసింహా నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా ‘క్రాక్’ వంటి సక్సెస్‌ఫుల్ మూవీని తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ రూపొందుతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తోంది. బాల‌కృష్ణ స‌ర‌స‌న శృతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. ఈ చిత్రంలో ప్ర‌తి నాయ‌కుడి పాత్ర‌ ద్వారా క‌న్న‌డ న‌టుడు దునియా విజ‌య్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. బాలకృష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌ ని ఎంపిక చేసుకున్నారు. ఇదే విషయాన్ని చిత్ర బృందం బుధవారం అధికారికంగా ప్రకటించింది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ‘క్రాక్’ చిత్రం న‌టిగా వరలక్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌ కి మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. దీంతో టాలీవుడ్ లో పవర్ ఫుల్ పాత్రలకు జయమ్మ కేరాఫ్ అడ్రస్ గా మారింది. బాలకృష్ణ 107వ సినిమాలో మ‌రోసారి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో క‌నిపించ‌నుంది వ‌ర‌లక్ష్మీ శ‌ర‌త్ కుమార్‌.
మాస్ హీరో మ‌రియు మాస్ ద‌ర్శ‌కుడు ఇద్దరూ కలిసి మాస్ ఆడియన్స్ కి ఈ సినిమాతో మాంచి విందు భోజనాన్ని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు దర్శకుడు గోపీచంద్ మలినేని.
న‌వీన్ ఎర్నేని, వై ర‌వి శంక‌ర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా మాట‌లు అందిస్తున్న ఈ చిత్రానికి రిషీ పంజాబీ సినిమాటోగ్ర‌ఫి, నవీన్ నూలీ ఎడిటింగ్‌, రామ్ లక్ష్మణ్ ఫైట్స్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించనున్నారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్, దునియా విజ‌య్, వ‌ర‌లక్ష్మి శ‌ర‌త్ కుమార్‌
సాంకేతిక బృందం:
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్టర్: గోపీచంద్ మలినేని
నిర్మాతలు: నవీన్ యెర్నేని, వై రవిశంకర్
బ్యానర్: మైత్రీ మూవీ మేకర్స్
సంగీతం: తమన్ ఎస్
డీఓపీ: రిషి పంజాబీ
ఎడిటర్: నవీన్ నూలి
ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
ఫైట్స్ : రామ్‌- లక్ష్మణ్
సీఈవో : చెర్రీ
కో డైరెక్టర్: కుర్రా రంగరావు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి
లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ
పబ్లిసిటీ: బాబా సాయి కుమార్
మార్కెటింగ్: ఫస్ట్ షో
పీఆర్వో : వంశీ-శేఖర్

Related posts

Leave a Comment