తెలుగు వాడి వేడికి ‘ఆస్కార్’!

తెలుగు వాడి వేడికి 'ఆస్కార్'!
Spread the love

సాహిత్యపు సొబగులతో
పల్లె మట్టి పరిమళం ను
చంద్రన్న కవనంలో రంగరించి జాలువారిన అక్షర ఝరి
ఆటకు పాట తోడై
‘త్రిబుల్ ఆర్’ సినిమాకే హైలెట్ గా
పోలేరమ్మ జాతరలో అంటూ వీరత్వాన్ని చూపిస్తూ
పట్టుదలకు మొక్కవోని ధైర్యంతో శ్రమైక జీవన సౌందర్యాన్ని చూపిస్తూ
‘నాటు నాటు..’ అంటూ కసిగా వేసిన అడుగులు
రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పులు……ఉప్పెన కాగా
తెలుగు వాడి వేడి విశ్వవ్యాప్తమైన పాటకు
సంగీత ప్రపంచంలో అనేక బాణీలను అందించిన కీరవాణి
పల్లె మట్టి పరిమళంలో ఒదిగిన నేపథ్యానికి రాజసం ఉట్టిపడేలా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా సెట్టింగ్ లు వేసి
ఇద్దరు అగ్ర నాయకులనే కాకుండా
బ్యాక్ రౌండ్ డ్యాన్సర్స్ తో స్టెప్పులు వేయించి
పాటకే ప్రాణం పోసిన సూటు బూటు స్టెప్పులు
‘నాటు నాటు..’ అంటూ ప్రతి ఎదను తడిపింది
ఆ తడిలో మన తెలుగు భాష సాహిత్యం మన సరి హద్దులు దాటి
ఒక తారక మంత్రంగా ‘నాటు నాటు..’ రాటు తెలి
మహోన్నత పాటగా ఆస్కార్ కీర్తి ప్రతిష్టలు గడించింది
తెలుగు పాట గొప్పదనాన్ని చాటిన పాట
ప్రతి తెలుగు హృదయాన్ని కాదు..
విదేశీ గడ్డపై తెలుగు తేజాన్ని సంస్కృతి సంప్రదాయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసుకొన్నా…నాటు
చంద్రన్న ప్రతి అక్షరం మన అంతరంగంలో ‘నాటు నాటు’ పదం వాటేసుకొని ‘ఆస్కార్’ను సొంతం చేసుకుంది.
పరిశ్రమించిన చిత్ర బృందానికి నా హృదయ పూర్వక నమస్సులు
జయహో తెలుగు…జయహో తెలుగు!!

-తులసి వేంకట రమణా చార్యులు
(అర్చకులు..కవి.. రచయిత, అక్షర కౌముది సామాజిక సాంస్కృతిక సాహిత్య సంస్థ అధ్యక్షులు)

(ఈ పాటకు ఆస్కార్ పురస్కారం ఎందుకు లభించిందో కూడా గమనించాలి. ఈ పాటలో ఎక్కడా అన్య భాష సంక్రమణం జరగలేదు. ఈ విషయాన్ని కూడా ఆస్కార్ పురస్కారం ఎంపిక బృందం పరిగణన లోకి తీసుకొని ఉంటుందని భావిస్తున్నాను)

Related posts

Leave a Comment