సూపర్‌స్టార్ రజినీకాంత్ 170వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జై భీమ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. నిర్మాత సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా తలైవర్ 170వ సినిమా అనౌన్స్‌మెంట్ చేశారు. ఈ మేరకు వారు ‘‘ఈరోజు మా చైర్మన్ సుభాస్కరన్ పుట్టినరోజు సందర్భంగా సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారి తలైవర్ 170వ సినిమాను మా బ్యానర్‌లో రూపొందించబోతున్నట్లు ప్రకటించటం ఆనందంగా ఉంది. టి.జె.జ్ఞానవేల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నారు. రాక్‌స్టార్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నారు. జి.కె.ఎం. తమిళ్ కుమరన్‌గారి నేతృత్వంలో త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. అలాగే 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం. ‘‘తలైవర్‌గారితో లైకా ప్రొడక్షన్స్ సంస్థకు ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆయనతో కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించాం. ఆయనతో ఉన్న అనుబంధం ఇలా కొనసాగటాన్ని ఎంతో గౌరవంగా భావిస్తున్నాం. ఫ్యాన్స్, ప్రేక్షకులు సంతోషపడేలా ఎన్నో గొప్పగా ఈ సినిమాను రూపొందించటానికి అందరి ఆశీర్వాదాలు మాకు ఇవ్వండి’’ అంటూ నిర్మాణ సంస్థ ప్రకటించింది. సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే తెలియజేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Related posts
-
రాఘవరాజ్ భట్ కు జాతీయ తులసి సమ్మాన్ పురస్కారం
Spread the love ప్రముఖ కథక్ నాట్యగురు రాఘవరాజ్ భట్ కు ప్రతిష్టాత్మక తులసి సమ్మాన్ లభించింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ... -
చివరి వరకు సస్పెన్స్ మెయింటైన్ అవుతూనే ఉంటుంది.. “ఒక పథకం ప్రకారం” దర్శక, నిర్మాత వినోద్ కుమార్ విజయన్
Spread the love సంచలన దర్శకుడు పూరి జగన్నాధ్ సోదరుడు సాయిరామ్ శంకర్ నటించిన సీట్ ఎడ్జ్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఒక... -
Oka Pathakam Prakaaram will Maintain Suspense Till The End: Director Vinod Kumar Vijayan
Spread the love Sai Ram Shankar, the younger brother of sensational director Puri Jagannadh, is starring in...