ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం

maa alludu shooting strat
Spread the love

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న నేను, పృథ్వీ గారు రీల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ గా నటిస్తున్నాము. ఒక విలేజ్‌లో ఉంటున్న వారి మెంటాలిటీ, ఆట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో.. యూత్ & ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమే ‘అల్లుడు బంగారం’. దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు. మంచి ఫ్యాషన్‌తో వర్క్ చేస్తున్న ఈ టీంను ప్రేక్షకులు ఆశీర్వదిస్తే ఇంకా ఈ ప్రొడక్షన్ లో అనేక సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు.
నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.
దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ… ‘‘గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తిగారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్ గారికి చెప్పడం జరిగింది. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. మంచి టీంను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు నేనీ కథ చెప్పడం జరిగింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నాను. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నేను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు నా కృతజ్ఞతలు..’’ అన్నారు.
నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మూవీలో ఫాదర్ – డాటర్ సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..’’ అన్నారు.
హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ… మాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.
అజయ్ కుమార్, శ్రీలక్ష్మి, సుమన్, పృథ్వీరాజ్, గౌతంరాజ్, విజయరంగరాజ్, జబర్ధస్త్ షేకింగ్ శేషు, జబర్థస్త్ అప్పారావు, ఫిష్ వెంకట్, శ్రీనివాస్, కోట శంకరరావు, సుధ, సతీష్ చౌదరి, గబ్బర్‌సింగ్ బ్యాచ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి
కెమెరా: పిఆర్ చందర్‌రావు,
పాటలు: కాసర్ల శ్యామ్,
సంగీతం: షారుక్ షేక్,
పీఆర్వో: బి. వీరబాబు,
నిర్మాత: లావణ్య చంద్రశేఖర్
కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకటనరహింహ రాజ్.

Related posts

Leave a Comment