కీరవాణి- చంద్రబోస్ లకు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు

కీరవాణి- చంద్రబోస్ లకు ఫిలిం క్రిటిక్స్ అభినందనలు
Spread the love

ఆర్.ఆర్.ఆర్ సినిమా తెలుగు తెరపై ఓ చరిత్ర సృష్టించింది. అంతేకాదు అంతర్జాతీయ వేదికపై కూడా హిస్టరీ క్రియేట్ చేసింది. నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ మ్యూజిక్ కేటగిరి కింద ఆస్కార్ అవార్డు రావడం తెలుగు సినిమా పతాక ఖ్యాతిని ప్రపంచం నలుమూలల రెపరెపలాడించారు ఎం.ఎం కీరవాణి, చంద్రబోస్. ఆర్.ఆర్.ఆర్ సినిమాలో పాట రాసిన చంద్రబోస్ , సంగీతం సమకూర్చిన ఎం.ఎం కీరవాణిలు ఆస్కార్ అవార్డు అందుకోవడం పట్ల ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సంతోషం వ్యక్తం చేస్తూ , వారికి హృదయ పూర్వకంగా శుభాకాంక్షలు అందజేస్తోందని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి , ప్రధాన కార్యదర్శి ఎం. లక్ష్మి నారాయణ తెలిపారు. తెలుగు సినిమాను ప్రపంచ వేదికపైకి ఆవిష్కరించిన ఆర్.ఆర్.ఆర్ టీమ్ ను ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అభినందిస్తోందన్నారు. .

Related posts

Leave a Comment