‘కఠారి కృష్ణ’ టీమ్ కు మంత్రి హరీష్ రావు అభినందన

katarikrishna || Telugu movie
Spread the love

మన తెలంగాణ బిడ్డ కొడంగల్ నియోజకవర్గం మెట్లకుంట గ్రామానికి చెందిన, సాఫ్ట్ వేర్ వ్యాపారవేత్త అయిన ఆలమయ్య నాయుడు నిర్మాత గా మారి ‘కఠారి కృష్ణా’ అనే చిత్రాన్ని పి.ఏ నాయుడు అనే స్క్రీన్ పేరుతొ నిర్మించడం జరిగింది . మన ప్రాంతానికి చెందిన వ్యక్తి చాలా రోజులగా వివిధ ప్రజా సేవ కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు సినిమారంగం లో ప్రవేశించి సందేశాత్మక చిత్రాలు నిర్మించాలి అని సంకల్పించటం అభినందనీయం. పి.ఏ నాయుడు గారు మొదటి ప్రయత్నంగా సినిమా రంగంలో ప్రవేశించి ‘కఠారి కృష్ణ’ సినిమాను ప్రముఖ కమెడియన్ గౌతమ్ రాజు గారి అబ్భాయి కృష్ణను హీరోగా పెట్టి నిర్మించడం మనందరికీ చాలా సంతోషం . అలాగే చాణక్య , రేఖా నిరోషా, పోసాని కృష్ణ మురళి, టి.ఎన్.ఆర్, మిర్చి మాధవి లాంటి తారాగణంతో వస్తున్న ఈ సినిమా డిసెంబర్ 10న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలలో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా దిగ్విజయం అయ్యి పి.ఏ నాయుడు గారు భవిష్యతోలో ఇంకా ఎన్నో సినిమాలు చేయాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను” అన్నారు మంత్రి హరీష్ రావు సినిమా డైరెక్టర్ ప్రకాష్ తిరుమల శెట్టి మరియు సినిమా యూనిట్ ను సన్మానంతో అభినందనలు చెప్పారు.
అలాగే కొడంగల్ MLA నరేందర్ రెడ్డి గారు, జాతీయ BC నాయకులు R కృష్ణయ్య గారు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు V. హనుమంత రావు గారు, అలాగే OU విద్యార్థి నాయకులు, ఇతర రాష్ట్ర నాయకులూ ” కఠారి కృష్ణ” మూవీ టీంను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

Leave a Comment