‘ఉత్తమ విలన్’ కేరాఫ్ మహాదేవపురం బిగ్ హిట్ అవ్వాలి

uttamavilan movie
Spread the love

ప్రి రిలీజ్ ఈవెంట్ లో ఆర్జీవీ, సత్యా రెడ్డి, డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్
హృషీకేష క్రియేషన్స్, బీష్మా ప్రొడక్షన్స్ పతాకంపై విజయ్, శ్రావ్య (తొలిపరిచయం) జంటగా రాజారెడ్డి పానుగంటి దర్శకత్వంలో వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “ఉత్తమ విలన్” కేరాఫ్ మహాదేవపురం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్దమైన సందర్బంగా చిత్ర యూనిట్ ప్రి రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన ప్రముఖ దర్శకుడు RGV చిత్ర ట్రైలర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్, దర్శక,నిర్మాత సత్యా రెడ్డి, మాజీ ఎం. ఎల్. ఏ నగేష్ పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఆర్జీవీ, మాట్లాడుతూ….”ఉత్తమ విలన్” టీజర్ బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రాన్ని రాజారెడ్డి పానుగంటి, వి. సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి శ్రవణ్ కుమార్ లు చాలా చక్కగా తెరకెక్కించారు . నటీనటులు అందరూ చక్కగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలి అన్నారు
Ex యం యల్ ఏ నగేష్ మాట్లాడుతూ..నిజమైన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే లక్ష్మణ్ రావు గారు తనకు వన్ మాన్ ఆర్మీ అనే పేరుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో అంటే ఈ దేశంలో రాష్ట్రంలో ఆ పేరున్న ఏకైక వ్యక్తి లక్ష్మణ్ గారు అలాంటి వ్యక్తి ఇప్పుడు ఉత్తమ విలన్ సినిమాకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది. ట్రైలర్ చాలా బాగుంది.లవ్ & యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా నూటికి నూరుపాళ్లు కచ్చితంగా సక్సెస్ అవుతుందని పూర్తిగా నమ్ముతున్నాను. అన్ని రకాల మసాలాతో పాటు రౌద్రాన్ని కూడా చాలా గొప్పగా ఉన్నట్టు తెలుస్తోంది. వీరు ఓ మధు సినిమా తీసి బిగ్ హిట్ కొట్టారు.ఇప్పుడు వస్తున్న ఉత్తమ విలన్ సినిమాను కూడా అంతకంటే పెద్ద సక్సెస్ కావాలని కోరుతున్నాను అన్నారు.
ఏ సి పి లక్ష్మణ్ రావు మాట్లాడుతూ..”ఉత్తమ విలన్” సినిమా టైటిల్ చాలా బాగుంది. దర్శక, నిర్మాతలు ఈ సినిమాను చాలా బాగా తీశారు మా Ex ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ సినిమాలో ఖాన్ గారు విలన్ గా చాలా బాగా చేశాడు. సినిమాలో విలన్ అయినా తను నిజ జీవితంలో నలుగురికి మంచి చేసినవి చాలా ఉన్నాయి. కానీ అవి బయటికి రావు, తను ఈ సినిమాలో విలన్ గా చాలా చక్కగా నటించాడు. మంచి కథతో వస్తున్న ఈ సినిమా బిగ్ సక్సెస్ కావాలని కోరుతున్నాను..
గెస్ట్ గా వచ్చిన దర్శక నిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ.. RGV గారు వచ్చి దర్శకుడు పానుగంటి రాజా రావు గారిని ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. తను గతంలో నిర్మించిన చిత్రం చాలా సక్సెస్ అయింది. ఆ సినిమా లాగే ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవ్వాలి. తను అనేక భాషల్లో దర్శకుడిగా తీశాడు. ఇప్పుడు తెలుగులో ఆరో చిత్రంగా “ఉత్తమ విలన్” సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.ఖాన్ గారు విలన్ గా చాలా బాగా చేశాడు. నేను తీయబోయే “జై ఉత్తరాంధ్ర” సినిమాలో తనను విలన్ గా నటించే అవకాశం ఇస్తాను. ఈ సినిమాలో నటీనటులు కూడా చాలా బాగా నటించారు.మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి అన్నారు.
డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ.. “ఉత్తమ విలన్” టైటిల్ చాలా బాగుంది.ఈ టైటిల్ కు పానుగంటి రాజారెడ్డి గారు బాగా న్యాయం చేశాడని నమ్ముతున్నాను. అలాగే సాయి లక్ష్మీనారాయణ గౌడ్ గారు శ్రవణ్ గౌడ్ లు ఈ సినిమా కొరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించారు. ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలి. ఎందుకంటే ఇందులో సీనియర్స్ తక్కువ మంది ఉన్నా ఎక్కువ శాతం అంతా కొత్త వాళ్లతో తీసాడు.కొత్తవాళ్లతో చక్కటి పర్ఫార్మెన్స్ రాబట్టాలంటే చాలా కష్టపడాలి.తమిళ్ లో కమలహాసన్ గారు “ఉత్తమ విలన్” సినిమా తీసి బిగ్ సక్సెస్ సాధించాడు. ఈ సినిమా కూడా ఆ సినిమా రేంజ్ లో బిగ్ హిట్ అయ్యి దర్శక నిర్మాతలకు మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
చిత్ర నిర్మాత సాయి లక్ష్మీనారాయణ గౌడ్, శ్రవణ్ గౌడ్ లు మాట్లాడుతూ..ఎంతో బిజీ గా ఉన్నా మా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేసిన RGV గారికి ధన్యవాదాలు. ఉత్తమ విలన్ కేరాఫ్ మహాదేవపురం సినిమా చాలా బాగా వచ్చింది.ఈ సినిమాను నేను శ్రవణ్ కలిసి నిర్మించాము.దర్శకుడు రాజారెడ్డి పానుగంటి ఈ సినిమాను ఒక మూవీ లో కాకుండా ఫ్యామిలీ లాగా అందరూ కలిసి చాలా బాగా తీశాడు .చక్కటి  ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ “ఉత్తమ విలన్” చిత్రం అందరినీ అలరిస్తుంది.ఇందులో నటించిన నటీనటులు అందరు కూడా చాలా బాగా నటించారు. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
చిత్ర దర్శకుడు రాజారెడ్డి పానుగంటి మాట్లాడుతూ..గతంలో నేను ఓ మధు అనే సినిమా చేశాను. ఆ సినిమా అప్పుడు 100 డేస్ ఆడడంతో అందరూ అక్షర్య పోయారు. ఇప్పుడు వస్తున్న ఉత్తమ విలన్ సినిమాను ప్రొడ్యూసర్స్ సాయి, శ్రావణ్ లు ఈ మూవీ కొరకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా  ఏం కావాలంటే అది కాదనకుండా చాలా చక్కగా నిర్మించారు. నటీనటులకు, డైరెక్షన్ , టెక్నికల్ డిపార్ట్ మెంట్స్ అందరూ సహకరించడంతో సినిమా బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా సినిమాను బిగ్ హిట్ చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.
విలన్ గా నటించిన హరీష్ మాట్లాడుతూ..ఇందులో నేను పార్ధు అనే క్యారెక్టర్ చేశాను ఇంతకుముందు నేను ఐదు సినిమాలు చేశాను. అయిన ఈ సినిమాలో నాకు డిఫరెంట్ షేడ్స్ పాత్రలో నటించాను. ఒక ఆర్టిస్ట్ కి ఇన్ని షేడ్స్ ఉన్న పాత్ర దొరకడం అదృష్టం గా భావిస్తున్నాను. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.
చిత్ర హీరో విజయ్ మాట్లాడుతూ.. నేను ఒకప్పుడు అడియన్ లా ఉండి సినిమా చూసే వాన్ని. అటువంటి నాకు ఈ సినిమాలో లీడ్ రోల్ చేసే అవకాశం కల్పించారు.కథ చాలా బాగుంది.ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు.
హీరోయిన్ శ్రావ్య మాట్లాడుతూ.. నాకిది తొలి చిత్రం. ఉత్తమ విలన్ వంటి మంచి చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఉత్తమ విలన్ బిగ్ హిట్ అవ్వాలని అన్నారు.
జబర్దస్త్ అప్పారావు బాబురావు సాయి, హరీషు  శ్రావ్య  (సక్కు) రాజు.  విజయ,ఆసిఫ్ అన్న.   రామానాయుడు నీలిమ,  శ్రవణ్,  మల్లి మామ, హుస్సేన్,మురళి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్స్  – వి సాయి లక్ష్మీనారాయణ గౌడ్, పి. శ్రవణ్ కుమార్, డైరెక్టర్ – రాజారెడ్డి పానుగంటి, సంగీతం – శౌరీ, జాన్, డాన్స్ – మురళి, ఎడిటర్ –  గుణశేఖర్, డబ్బింగ్  – రాజ్ కుమార్,అన్విక స్టూడియోస్, పి ఆర్ ఓ –  మధు. వి.ఆర్

Related posts

Leave a Comment