ఈ నెల 20 న వస్తున్న ‘అవలంబిక’

avalambika movie matter and photos
avalambika movie matter and photos
Spread the love

ర్చన, సుజయ్, మంజూష పొలగాని ముఖ్య పాత్రల్లో రాజశేఖర్ దర్శకత్వంలో షిరిడి సాయి ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత జి శ్రీనివాస్ గౌడ్ నిర్మిస్తున్న సోసియో ఫాంటసీ హర్రర్ చిత్రం ‘అవలంబిక’. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ చిత్రాన్ని ఈ నెల 20 న విడుదల చేస్తున్నారు. ఇటీవల మెగా బ్రదర్ నాగబాబు ట్రైలర్ ని విడుదల చేసారు. అలాగే ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన సాంగ్స్, టైలర్ మంచి హైప్ క్రియేట్ చేయడంతో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఈ సందర్బంగా దర్శకుడు రాజశేఖర్ మాట్లాడుతూ .. ఆద్యంతం ఆసక్తితో, ఉత్కంఠతో తెరకెక్కించిన చిత్రమిది. చిత్రీకరణ విషయంలో చాలా కష్టపడ్డాం, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. ఈ విషయంలో మా నిర్మాత శ్రీనివాస్ గౌడ్ సపోర్ట్ చాలా ఉంది. ఇందులో ఐదు పాటలు, ఐదు ఫైట్స్ ఉంటాయి. సోసియో ఫాంటసీ హర్రర్ అంశంలతో తెరకెక్కిన ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రాన్ని ఈ నెల 20 న థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం అన్నారు.
కృష్ణ చైతన్య, లావణ్య, వై వి రావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా వెంకీ పెద్దాడ, సంగీతం ఉదయ్ కిరణ్, ఎడిటింగ్ : శ్రీ చందు, ఆర్ట్ : రవిబాబు, నిర్మాత : జి శ్రీనివాస్ గౌడ్, దర్శకత్వం : రాజశేఖర్.