నిజ ఘటనల ఆధారంగా రూపొందిన వెబ్ ఫిల్మ్.. జూన్ 7 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
అతనొక సామాన్యమైన వ్యక్తి.. వృత్తి రీత్యా లాయర్. కొన్ని పరిస్థితుల్లో ఓ అసామాన్యమైన వ్యక్తితో ఓ కేసు పరంగా పోరాటం చేయాల్సి వస్తుంది. ఆ సామాన్యుడికి తానెలాంటి పోరాటం చేస్తున్నాననే సంగతి తెలుసు. దాని వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఎలా ఉంటాయనేది కూడా బాగా తెలుసు. కానీ ఓ అమ్మాయికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో సంఘంలో పేరు, ప్రతిష్టలున్న, అభిమాన గణం మెండుగా ఉన్న ఓ స్వామీపై పోరాటం చేయటానికి నిశ్చయించుకుంటాడు. మరి ఆ గాడ్ మ్యాన్ మీద ఈ కామన్ మ్యాన్ విజయాన్ని సాధించాడా? అనేది తెలియాలంటే ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ వెబ్ ఒరిజినల్ ఫిల్మ్ చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
ఉత్తరాదితో పాటు దక్షిణాదిన కూడా విలక్షణమైన పాత్రలతో తనదైన గుర్తింపు పొందిన నటుడు మనోజ్ బాజ్‌పాయి ప్రధాన పాత్రలో నటించిన వెబ్ ఒరిజినల్ మూవీ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్‌పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించారు. హిందీలో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందటంతో దీన్ని జూన్ 7న తెలుగు, తమిళంలోనూ రిలీజ్ చేస్తున్నారు. అందులో భాగంగా ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ట్రైలర్‌ను తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు.
ట్రైలర్‌ను గమనిస్తే.. నిజ ఘటనలు ఆధారంగా ఈ వెబ్ ఫిల్మ్‌ను తెరకెక్కించారు. నూసిన్ అనే మైనర్ బాలికతో ఓ స్వామిజీ తప్పుగా ప్రవర్తిస్తుంది. దీంతో ఆ అమ్మాయికి అండగా లాయర్ సోలంకి (మనోజ్ బాజ్‌పాయి) నిలబడతాడు. అప్పటి వరకు చేసిన పోరాటాలకు.. తానిప్పుడు చేయబోయే పోరాటం ఎంతో వైవిధమ్యైనదో తెలిసాని సోలంకి అమ్మాయికి తన మద్దతుని తెలియజేస్తాడు. మరి ఆ కేసులో గెలిచింది ఎవరు? స్వామీజీకి శిక్ష పడిందా? అనేది ఆసక్తికరంగా, ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాలనే ఎగ్జయిట్మెంట్ మరింత పెంచుతుంది.
సోసైటీ కొందరు మంచి అనే ముసుగు వేసుకుని చెడు పనులు చేస్తుంటారు. అలాంటి ఓ బాబా ఓ మైనర్ బాలికను ఇబ్బంది పెడతాడు. ఆ అమ్మాయి ధైర్యంగా ఆయనపై ఫిర్యాదు చేస్తుంది. అయితే సదరు బాబా అనుంగ భక్తులు ఆ అమ్మాయిపై ఎదురు దాడికి దిగుతారు. అప్పుడు ఓ లాయర్ ఆ అమ్మాయి తరపున నిలబడి ఎలాంటి న్యాయం చేశాడనే నిజ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు. అందరిలో సోషల్ అవేర్‌నెస్‌ను కలిగించే చిత్రమిది.
నటీనటులు: పి.సి.సోలంకి పాత్రలోమనోజ్ బాజ్‌పాయ్, నూసిన్‌గా అడ్రిజ, స్వామిజీగా సూర్య మోహన్, అమిత్ నిహాగ్‌గా నిఖిల్ పాండే, చంచల్ మిశ్రాగా ప్రియాంక సేథియ, నూసిల్ తండ్రి పాత్రలో జైహింద్ కుమార్, నూసిల్ తల్లి పాత్రలో దుర్గా శర్మ తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: జీ స్టూడియోస్, భన్సాలి స్టూడియోస్ లిమిటెడ్
నిర్మాతలు: వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్
దర్శకత్వం: అపూర్వ సింగ్ కర్కి
క్రియేటివ్ ప్రొడ్యూసర్: సుపర్ణ్ ఎస్.వర్మ
కో ప్రొడ్యూసర్: జూహీ పరేక్ మెహతా
డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ: అర్జున్ కుక్రేటి
రైటర్: దీపక్ కింగ్రాని