ఈ మధ్య కాలంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ గురించి పరిశ్రమకు చెందిన కొంత మంది వ్యక్తులు వారి వ్యక్తిగతంగా తెలుగు చిత్ర పరిశ్రమ గురించి అనేక విషయాలు మాట్లాడడం జరుగుతుంది. ఇలాంటి ప్రెస్ మీట్ వలన చిత్ర పరిశ్రమలోనే కాకుండా, ప్రజల్లో గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది, కాబట్టి ఇలాంటి ప్రెస్ మీట్ లలో చిత్ర పరిశ్రమ దాని విభాగముల గురించి ఏ వ్యక్తి మాట్లాడినా అది వారియొక్క వ్యక్తిగత అభిప్రాయము మాత్రమే అని గమనించగలరు, ఈ విషయాన్నీ గతంలో తెలుగు చలన చిత్ర వాణిజ్యమండలి తెలియజేసింది.
ఈ విషయమై తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఈ క్రింది తెలియపరచిన విధంగా వివరణ తెలియజేయడం జరిగింది.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గుర్తింపు పొందిన సంఘములు :-
1) తెలుగు ఫిలిం చాంబర్ అఫ్ కామర్స్ 2) తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి 3) తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ 4) మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 5) తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ మరియు వారి అనుబంధ సంఘములు,(24Crafts) నుండి Authorization పొందిన అధ్యక్షులు గాని, కార్యదర్శులు గాని, ప్రెస్ మీట్ లలో గానీ, మరి ఏ ఇతర సభలలో చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడిన విషయాలు మాత్రమే, తెలుగు చిత్ర పరిశ్రమకు సంబందించిన విషయాలుగా పరిగణించగలరు, కాబట్టి ఆయా సంఘాలనుండి మరి ఏ ఇతర వ్యక్తులు చలన చిత్ర పరిశ్రమ విషయమై మాట్లాడినా అవి వారి వ్యక్తి గత అభిప్రాయ మే కానీ చిత్రపరిశ్రమకు సంబంధం లేనివిగా భావించగలరు.
– టి. ప్రసన్న కుమార్, గౌరవ కార్యదర్శి , మోహన్ వడ్లపట్ల, గౌరవ కార్యదర్శి