డిఫరెంట్ జోనర్స్‌లో సినిమాలను రూపొందించి నేషనల్ అవార్డును పొందిన దర్శకుడు రాజేష్ టచ్‌రివర్. అంతర్జాతీయస్థాయిలో తన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న ఆయన సినిమాలపై మార్చి 6 నుంచి మార్చి 8 వరకు రవీంద్ర భారతిలో ఫిల్మ్ ఫెస్టివల్‌ను నిర్వహించారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, 53 ఈఎక్స్‌పీ ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, సన్ టచ్ ప్రొడక్షన్స్ కలయికలో ఈ ఫెస్టివల్‌ను నిర్వహించారు. ఇందులో సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోస్, షార్ట్ పిల్మ్స్, డాక్యుమెంటరీస్‌ను ప్రదర్శించి వాటి గురించి పలువురు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరూ కలిసి చర్చించారు.
రాజేష్ టచ్‌రివర్ డెబ్యూ డైరెక్షనల్ బ్రిటీష్ ఫీచర్ ఫిల్మ్ ‘ఇన్ ది నేమ్ ఆఫ్ బుద్ధ’ సినిమాతో ఈ ఫెస్టివల్‌ను స్టార్ట్ చేశారు. దేశ విదేశాల్లో విమర్శకుల ప్రశంసలను అందుకున్న పలు అవార్డులతో ప్రెస్టీజియస్ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో నామినేట్ అయ్యింది. ఈ సినిమా ప్రదర్శనకు ముందు ప్యానెల్ డిస్కషన్ కూడా జరిగింది. సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, సి.హెచ్.సుశీల్ రావు, డాక్యుమెంట్ ఫిల్మ్ మేకర్ సునీతా కృష్ణన్ తదితరులు వైవిధ్యమైన సినిమాలను రూపొందించటంలో ఉన్న ఆటు పోట్లను గురించి అందరూ చర్చించారు. ఎవరూ టచ్ చేయని పాయింట్స్‌తో ఇండిపెండెంట్ సినిమాలు చేసే మేకర్స్ ఎదుర్కొనే ఆర్థిక సమస్యలు, కంటెంట్, చిన్న- పెద్ద చిత్రాల్లోని కంటెంట్, బడ్జెట్ తదితర అంశాలపై డీప్‌గా చర్చ జరిగింది. తమ్మారెడ్డి భరద్వాజ్ మాట్లాడుతూ కంటెంట్ ప్రధానంగానే సినిమాలు చేస్తే మంచిదని మేకర్స్‌కి తెలిపారు. ఓ సినిమా ఎలా ఉండాలనేది నిర్మాత మాత్రమే నిర్ణయించుకోవాల్సిన అంశం. ఎంటర్టైనింగ్‌గా ఉంటూ బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను రాబట్టాలా లేక ప్రజల్లో సామాజిక పరివర్తను సూచించే అంశాన్ని ఉండేలా చూసుకోవాలనేదే ఆయన పరిధిలోనే ఉంటుంది. అలాగే ఇతర ప్యానలిస్ట్‌లు మంచి చిత్రాలను ప్రేక్షకులకు చేరవేయడానికి చలనచిత్రోత్సవాలు, OTT వంటి ఇతర మార్గాలపై చర్చించారు.
ఫెస్టివల్ రెండో రోజున ప్రముఖ నిర్మాత శరత్ మరార్, సాయి ప్రసాద్, జెమిని టీవీ సతీష్ కాశెట్టి, యాక్టర్ మధుశాలిని పాల్గొన్నారు. ప్రముఖ యాంకర్ స్వప్న మోడరేట్ చేసిన ప్యానెల్ ఇండిపెండెంట్ ఫిల్మ్స్ నిర్మాణ నుంచి డిస్ట్రిబ్యూషన్ వరకు ఉండే అవకాశాల గురించి చర్చించారు. అలాగే ప్రత్యేకమైన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేసి వాటిని ఈ చిత్రాలను ప్రదర్శించేలా చర్యలు తీసుకోవాలని చర్చించారు. ఎందుకంటే ప్రస్తుతం ఓటీటీ వేగంగా అభివృద్ధి చెందుతుందని, ఇలాంటి సందర్భంలో మంచి, అర్థవంతమైన సినిమాలను అందించటానికి ఓటీటీ బెటర్ ఆప్షన్ అవుతుందని ప్యానెల్ ఆశాభావం వ్యక్తం చేసింది.
ఇక ఫెస్టివల్‌లో చివరి రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కూడా కావటంతో సినిమాల్లో మహిళలు గురించి ప్యానెల్ డిస్కస్ చేసింది. ఇందులో నిర్మాత, గురు ఫిలిమ్స్ అధినేత సునీత తాటి, నిర్మాత నిహారిక కొణిదెల, ఫిల్మ్ జర్నలిస్ట్, ఎన్‌టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ హెడ్ తరుణ, సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ ఎల్.రవిచందర్ తదితరులు పాల్గొన్నారు. సినీ రంగంలోని మహిళల ప్రాధాన్యత, మహిళలకు ఎదురవుతున్న చాలెంజెస్ గురించి చర్చించారు. సినీ రంగంలో మహిళల ప్రాముఖ్యతను పెంచేలా చర్యలు తీసుకుంటాని అక్కడున్న సినీ ప్రముఖులందరూ నిర్ణయించుకుని చేసిన ప్రతిజ్ఞతతో డిస్కషన్స్ ముగిశాయి. ఈ కార్యక్రమంలో చివరగా 9 అంతర్జాతీయ అవార్డులు, 3 నేషనల్ అవార్డులు, నాలుగు నంది అవార్డులు గెలుచుకున్న నా బంగారు తల్లి చిత్రాన్ని ప్రదర్శించారు. రాజేష్ టచ్ రివర్ మూడు రోజుల పాటు అక్కడ ఉండే సినీ రంగంలో రాణించాలనుకుంటున్న ఔత్సాహికులతో మాట్లాడి వారికి స్పెషల్ మాస్టర్ క్లాస్ నిర్వహిస్తానని చెప్పారు.