అక్కినేని నాగార్జున, నాగ‌చైత‌న్య, క‌ళ్యాణ్ కృష్ణ‌, జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రై.లి బంగ‌ర్రాజు బ‌ర్త్‌డే స్పెష‌ల్ పోస్ట‌ర్ విడుద‌ల‌

akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed
akkineni Nagarjuna, Naga Chaitanya, Kalyan Krishna, Zee Studios, Annapurna Studios Pvt Ltd Bangaraju Birthday Special Poster Revealed
Spread the love

కింగ్‌ నాగార్జున, యువసామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్యల కాంభినేష‌న్‌లో రూపొందుతోన్న క్రేజీ మ‌ల్టీస్టారర్ బంగ‌ర్రాజు. ఇది బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ సోగ్గాడే చిన్నినాయ‌న సినిమాకి సీక్వెల్‌. ఇటీవ‌ల చిత్రీక‌ర‌ణ ప్రారంభించిన ఈ చిత్రానికి క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతుంది.
నాగార్జున పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బంగ‌ర్రాజు చిత్రం నుండి బ‌ర్త్ డే స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌. సోగ్గాడే చిన్నినాయ‌న మ్యాజిక్‌ను పునరావృతం చేసేలా అదే ఫాంట్ మరియు డిజైన్ ను ఉపయోగించారు.
బంగార్రాజు..ది డెవిల్ ఈజ్ బ్యాక్ అని పోస్టర్‌లో పేర్కొన్నారు. బ్లాక్ రే-బ్యాన్ గ్లాసెస్ మ‌రియు తెల్లటి చొక్కా, పంచె కట్టుతో పోస్టర్‌లో అచ్చ తెలుగు దసరా బుల్లోడుగా కనిపిస్తున్నారు కింగ్ నాగార్జున‌. పంచె కట్టు విషయంలో నాగార్జునకు ఎవ‌రు సాటిరారు. ఈ పోస్ట‌ర్‌లో స్వర్గం నుండి భూమికి వస్తున్న మన్మధుడులా కనిపిస్తున్నారు నాగార్జున‌.
అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా అవుట్ అండ్ అవుట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ద‌ర్శ‌కుడు క‌ళ్యాన్ కృష్ణ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.
సోగ్గాడే చిన్నినాయ‌నా మూవీలో నాగార్జున ప‌క్క‌న గ్రేస్‌ఫుల్‌గా క‌నిపించిన ర‌మ్య‌కృష్ణ ఇప్పుడు బంగార్రాజులోనూ న‌టిస్తున్నారు. కుర్ర‌కారు మ‌న‌సు దోచుకున్న బెంగుళూరు భామ కృతి శెట్టిని నాగచైత‌న్య స‌ర‌స‌న న‌టిస్తుంది.
అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును జీ స్టూడియోస్ స‌హ నిర్మిస్తోంది. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. స‌త్యానంద్ స్క్రీన్‌ప్లే స‌మ‌కూర్చారు. ఈ సినిమాకు ఛాయాగ్రాహ‌కుడిగా యువ‌రాజ్ ప‌నిచేస్తున్నారు.
ప్రీక్వెల్‌లో నాగార్జున ఒక్కడే అలరించగా, సీక్వెల్‌లో నాగార్జున, నాగ చైతన్య క‌లిసి రెట్టింపు వినోదాన్ని అందించబోతున్నారు.
న‌టీన‌టులు: అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ‌చైత‌న్య‌, ర‌మ్య‌కృష్ణ‌, కృతి శెట్టి, చ‌ల‌ప‌తిరావు, రావు ర‌మేష్‌, బ్ర‌హ్మాజీ, వెన్నెల కిశోర్‌, ఝాన్సీ త‌దిత‌రులు.
సాంకేతిక నిపుణులు:
క‌థ‌, మాట‌లు: క‌ల్యాణ్ కృష్ణ కుర‌సాల‌
నిర్మాత‌: అక్కినేని నాగార్జున‌
బ్యాన‌ర్స్: జీ స్టూడియోస్‌, అన్న‌పూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌
స్క్రీన్‌ప్లే: స‌త్యానంద్‌
సంగీతం: అనూప్ రూబెన్స్
కెమెరా: యువ‌రాజ్‌
ఆర్ట్ డైర‌క్ట‌ర్‌: బ్ర‌హ్మ క‌డ‌లి
పీఆర్ ఓ : వంశీ – శేఖ‌ర్