శనివారం గాంధీభవన్ లో ఉదయం 10.గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రిలే దీక్ష స్టేట్ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీతా రావు గారి ఆధ్వర్యంలో మైనారిటీ సోదరిమణులకు మద్దతుగా హిజాబ్ పై నిషేధం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఇతర భారతీయులతో పోలిస్తే ముస్లిములు సమాన హక్కులను పంచుకుంటారు అయితే హిజాబ్ పై నిషేధం దించడం ద్వారా హక్కులను బలహీన పరిచేందుకు బిజెపి. ఆర్ ఎస్ ఎస్ ప్రయత్నిస్తుంది. యూపీ మరియు ఇతర రాష్ట్రాల ఎన్నికలలో హిందుత్వ ఓటర్లను సేకరించేందుకు బిజెపి మతం కార్డు ప్లే చేస్తుంది. ఈ నిషేధం భారతీయుల లౌకికవాదానికి ముప్పు కలిగిస్తుంది.
హిజాబ్ ముస్కాన్ మాండ్యా విద్యార్థిని వ్యక్తిగత స్వేచ్ఛ. హిందువులకు సింధూరం పెట్టుకోవడం వ్యక్తిగత స్వేచ్ఛ తాము ఏమి ధరించాలి .ఎలా ఉండాలి. ఏం చేయాలి అన్న విషయాలపై సొంతగానిర్ణయాలు తీసుకునే శక్తి మహిళలకు ఉంటుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహన కార్యక్రమం కూడా జరిగింది తాడు బొంగరం లేని ప్రధానమంత్రి మైనార్టీ సోదరులకు వెంటనే క్షమాపణ చెప్పాలి
హిందూ. ముస్లిం. క్రిస్టియన్. సిక్కు. మతం ఏదైనా సరే మనమంతా భారతీయులం మే. త్రివర్ణ పతాకం రూపొందించిన పింగళి వెంకయ్య అయినా. సారే జహాసే అచ్చా హిందుస్తాన్ హమారా అన్న మొహమ్మద్ ఇక్బాల్ అయినా. జనగణమన రాసిన రవీంద్రనాథ్ ఠాగూర్ అయినా వందేమాతరం రచించిన బకించంద్ర చటర్జీ అయినా వారంతా మనకు చెప్పింది 1 మనం ఎవరినైనా మన మంత భారతీయులం మే ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నీలం పద్మ. వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి. ప్రెసిడెంట్ కవిత షబానా. హిజ్రత్. జరీన్. జిలాని. కవిత. అలివేలు. ఇందిరా మొదలగు వారు పాల్గొన్నారు.