సేంద్రియ వ్యవసాయం చేసి , అధిక దిగుబడులు ఎలా సాధించాలో వివరిస్తూ, రైతుల పాలిట బయో పితామహుడిగా పేరు ప్రఖ్యాతులు సాధించిన, రాన్సాక్ ఆర్గా సీ.ఈ.ఓ డా. సి.వి.రత్నకుమార్ కు ప్రతిష్టాత్మకమైన, తమిళ యూనివర్సిటీ చెన్నై ,గౌరవ డాక్టరేట్ ప్రకటించింది. ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం గ్రామ వాస్తవ్యులు చింతలచెరువు రత్నకుమార్, గత 30 ఏళ్లుగా, సేంద్రియ వ్యవసాయ విధానంపై, ఎప్పటికప్పుడు, విస్తృత పరిశోధనలు చేసి ,ఆ దారిలో రైతులను ప్రోత్సహిస్తూ రాన్సాక్ ఆర్గా ద్వారా ,వారికి ప్రయోజనమైన ,సేంద్రియ ఎరువులను అందించి, మంచి ఫలితాలు సాధించి పెట్టినందుకు, ఆయనకు ఈ డాక్టరేట్ ప్రకటించినట్ట్లు, తమిళ యూనివర్సిటీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇంటర్ నేషనల్ అనుబంధంగా కొనసాగుతూ, విశేష పేరు ప్రఖ్యాతులు సాధించిన ,ఈ యూనివర్సిటీ గతంలో ఎందరో మహామహులకు ,డాక్టరేట్ లు అందించింది. ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న వారిలో ప్రఖ్యాత గాయకులు, స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, మనో, చిత్ర, ప్రముఖ దర్శకులు పి.వాసు, ప్రముఖ బ్యాడ్ మెంటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ తదితరులు ఉన్నారు. మార్చి 6న చెన్నైలో అతిరధ మహామహుల మధ్య, అత్యంత వైభవంగా జరిగిన ఈ ప్రదానోత్సవంలో సి.వి.రత్నకుమార్ కు ఈ డాక్టరేట్ ప్రదానం చేశారు. వెంకటాపురం కు చెందిన రత్నకుమార్ తండ్రి చింతల చెర్వు వెంకట రామారావును, స్ఫూర్తిగా తీసుకొని, సేంద్రియ వ్యవసాయ విధానంపై మక్కువ పెంచుకున్నారు. వాళ్ల నాన్న గారు 1980లోనే సేంద్రియ వ్యవసాయం చేసి, అధికదిగుబడిని సాధించారు. అలా సాధించడమే గాక, ఉత్తమ రైతు అవార్డును సైతం అందుకున్నారు. తండ్రి స్వర్గీయ చింతలచెర్వు వెంకట రామారావు పురుగు మందులు పంటలపై వాడేవారు కాదు. కెమికల్స్ వాడటం వల్ల పంట నాశనం అవడమే గాక, భూమి పాడై పోతుందని, ప్రగాఢంగా విశ్వసించేవారు. అందుకే తండ్రి బాటలో అడుగులు వేసి, రత్నకుమార్ సేంద్రియ వ్యవసాయం పై పరిశోధనలు చేశారు. భద్రాచలం డివిజన్ ఏరియాలో, తమిళ యూనివర్సిటీనుండీ డాక్టరేట్ అందుకున్న, మొట్టమొదటి వ్యక్తిగా , రత్నకుమార్ కావడం విశేషం. తమిళ యూనివర్సిటీ నుండి డాక్టరేట్ పొందడం పట్ల ఆయన స్నేహితులు, బంధు,మిత్రులు గ్రామ పెద్దలు, శ్రేయోభిలాషులు ,డాక్టర్ రత్న కుమార్ కు అభినందనలు తెలిపారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతం నుండి, అంచె లంచెలు గా ఎదిగి అపూర్వమైన గౌరవ డాక్టరేటు సాధించడం పట్ల ,పుట్టి పెరిగిన వెంకటాపురం గ్రామానికి గర్వకారణమని, పలువురు గ్రామస్తులు ఆయనకు శు శుభాభినందనలు తెలిపారు.
సి.వి.రత్నకుమార్ కు తమిళ యూనివర్సిటీ డాక్టరేట్
