అవేవీ నన్ను బాధించలేవు : అలియాభట్‌

None of that can hurt me: Alia Bhatt
Spread the love

రణబీర్‌కి లిప్‌స్టిక్‌ నచ్చదు. నేను వేసుకుంటే కూడా ఊరుకోడు. తీసేయ్‌మని గొడవ చేస్తాడు. ఆ విషయాన్నే ఓ ఇంటర్‌వ్యూలో చెప్పాను. దానికి పెడార్థాలు తీస్తూ రణబీర్‌ నన్ను వేధిస్తున్నాడని ఏవేవో రాసేశారు. నిజానికి రణబీర్‌ చాలామంచి మనిషి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాపై రాసినా నేను బాధపడను. అవి నన్ను బాధించలేవుకూడా. కానీ తనపై రాశారు. అప్పుడు మాత్రం బాధ అనిపించింది’ అని అలియాభట్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె కరణ్‌జోహార్‌ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో కరీనాకపూర్‌తో కలిసి పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చేతిలో ఫోన్‌ ఉన్న ప్రతివాడూ ప్రస్తుతం జర్నలిస్టే. రూమర్లు పుట్టిస్తూనే ఉంటారు. నేను సన్నగా మారటానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోటానికి కొన్ని సర్జరీలు చేయించుకున్నానంట. ఆమధ్య ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా ట్రోల్‌ అయింది. ఇలాంటివి చదువుతూ రణబీర్‌, నేనూ ఇంట్లో మంచి టైంపాస్‌ చేస్తుంటాం. నిజంగా వాళ్లకు థ్యాంక్స్‌ చెప్పాలి’ అంటూ చెప్పుకొచ్చింది అలియాభట్‌!!

Related posts

Leave a Comment