మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పాన్ ఇండియా మూవీ ‘మట్కా’ డిసెంబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్

Mega Prince Varun Tej's pan India movie 'Matka' is shooting regularly from December

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ త్వరలో తిరిగి యాక్షన్ లోకి దిగుతున్నారు. పలాస ఫేమ్ దర్శకుడు కరుణ కుమార్‌తో కలిసి తన తొలి పాన్ ఇండియన్ చిత్రం ‘మట్కా’ రెగ్యులర్ షూట్‌ను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించనున్న ఈ చిత్రం డిసెంబర్ నుండి సెట్స్‌పైకి వెళ్లనుంది. ప్రీ-ప్రొడక్షన్ ఫార్మాలిటీస్‌తో టీమ్ బిజీగా ఉంది. 1958-1982 మధ్య జరిగే కథ కావడంతో 50, 80ల మధ్య వాతావరణాన్ని రిక్రియేట్ చేయడానికి భారీ సెట్‌లు రూపొందించారు. యావత్ దేశాన్ని కదిలించిన యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కనున్న ఈ కథ వైజాగ్ నేపథ్యంలో సాగుతుంది. హైదరాబాద్‌లో ఓల్డ్ వైజాగ్‌ సిటీని తలపించే భారీ సెట్‌ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలను వుంటాయి. నలుగురు…

నందమూరి కుటుంబ సభ్యుల మధ్యవైభవంగా ‘బ్రీత్’ ప్రీరిలీజ్ ఈవెంట్

'Breathe' prerelease event in the presence of Nandamuri family members

నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ ప్రొడక్షన్ నెం 1గా తన కుమారుడు చైతన్య కృష్ణని హీరో గా పరిచయం చేస్తూ నిర్మించిన సీట్ ఎడ్జ్ ఎమోషనల్ థ్రిల్లర్ ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రానికి వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘బ్రీత్’ ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సినిమాపై చాలా క్యురియాసిటీని పెంచింది. డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. నందమూరి కుటుంబ సభ్యులు ఈ వేడుకలో అతిధులుగా పాల్గొన్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లో నందమూరి చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. నందమూరి అభిమానులందరికీ పేరుపేరునా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వేడుకకు విచ్చేసిన మా కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. మా తాతగారు నందమూరి…

రెండున్నర గంటలు నిజాయతీగా సినిమా తీసే దర్శకుడు అజయ్ భూపతి… నేను ఆయనకు పెద్ద ఫ్యాన్ : ‘మంగళవారం’ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో విశ్వక్ సేన్

Ajay Bhupathi, the director who makes two and a half hour films honestly... I am his big fan: Vishwak Sen at 'Mangalavaram' success celebrations

ప్రతి నటుడి జీవితాన్ని ఓ శుక్రవారం మారుస్తుంది… నా జీవితాన్ని ‘మంగళవారం’ మార్చింది : సక్సెస్ సెలెబ్రేషన్స్‌లో ప్రియదర్శి   న్యూఏజ్ ఫిలింమేకర్ అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా ‘మంగళవారం’. నవంబర్ 17న పాన్ ఇండియా రిలీజ్ చేశారు. అజయ్ భూపతికి చెందిన ‘A’ క్రియేటివ్ వర్క్స్ నిర్మాణ భాగస్వామ్యంతో ముద్ర మీడియా వర్క్స్ పతాకంపై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం. సురేష్ వర్మ నిర్మించారు. ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి బ్లాక్ బస్టర్ టాక్‌తో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో మాస్క్ వెనుక ఉన్నది ఎవరు? అని విడుదలకు ముందు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలిగింది. విడుదలైన తర్వాత చూసిన ప్రేక్షకులు సైతం ఆ ట్విస్ట్ రివీల్ చేయలేదు. ఇవాళ మాస్క్ వెనుక ఉన్న నటుడు, మాలచ్చిమ్మ పాత్రలో నటించిన ప్రియదర్శి…

ప్రపంచ ‘ట్రయత్‌లాన్‌ ’కు వరుసగా మూడుసార్లు ఎంపికైన తొలి భారతీయుడు మన తెలుగువాడు మన్మధ్ రెబ్బ..

Our Telugu man Manmad Rebba is the first Indian to be selected for the World Triathlon three times in a row.

స్పోర్ట్స్‌ అంటే మనకు గుర్తుకు వచ్చే మొదటి ఆట క్రికెట్‌. ఆ తర్వాత వాలీబాల్‌, ఫుట్‌బాల్‌, హాకీ.. ఇలా ఓ అరడజను మాత్రమే టక్కున గుర్తుకు వస్తాయి. కానీ ప్రపంచంలో మరిన్ని స్పోర్ట్స్‌ ఉన్నాయి. వాటిలో అత్యంత క్లిష్టమైన రేస్‌ ‘ట్రయత్‌లాన్‌’. ‘ట్రయత్‌లాన్‌’ అంటే ఈత కొట్టడం.. సైకిల్‌ తొక్కడం.. పరుగెత్తడం అనే మూడు స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌ కంబైన్డ్‌గా ఉంటాయి. ఇందులో కూడా అనేక ఛాంపియన్‌ షిప్‌లు ఉంటాయి. అన్నింటిలోకి అత్యంత క్లిష్టమైన ‘అల్ట్రామాన్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ హవాయి ట్రయత్‌లాన్‌’ అనే రేస్‌లో వరుసగా 2017,18,19 సంవత్సరాల్లో అర్హత సంపాదించిన ఏకైక భారతీయుడు, మన తెలుగువాడు,హైదరాబాద్ కు చెందిన మన్మధ్ రెబ్బ. ఇక్కడ ఆర్కిటెక్ట్‌ పూర్తి చేసి, యూఎస్‌లో కన్స్ట్రక్షన్ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేయటానికి వెళ్లిన ఆయన కోర్సు అనంతరం అక్కడే ఉద్యోగం చేస్తుండగా ఈ స్పోర్ట్స్‌…

సుడిగాలి సుధీర్ ‘కాలింగ్ సహస్ర’.. డిసెంబర్ 1న విడుదల

Sudhir Sudheer's 'Calling Sahasra'.. released on December 1

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు. సుధీర్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘కాలింగ్ సహస్ర’. షాడో మీడియా ప్రొడక్ష‌న్స్‌, రాధా ఆర్ట్స్ ప‌తాకాల‌పై అరుణ్ విక్కిరాలా ద‌ర్శ‌క‌త్వంలో విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుధీర్ స‌ర‌స‌న డాలీషా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా.. చిత్ర నిర్మాత‌లు విజేష్ త‌యాల్‌, చిరంజీవి ప‌మిడి, వెంక‌టేశ్వ‌ర్లు కాటూరి మాట్లాడుతూ ‘‘కాలింగ్ సహస్ర ఔట్ పుట్ బాగా వ‌చ్చింది. సినిమాపై మంచి ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. రీసెంట్‌గా రిలీజ్ చేసిన రెండు పాట‌లు, టీజ‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. డిసెంబ‌ర్ 1న వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ చిత్రాన్ని గ్రాండ్ లెవ‌ల్లో…

Title finalized as ‘Ugly Story’ for next movie from Lucky Media

Title finalized as 'Ugly Story' for next movie from Lucky Media

Bekkam Venugopal, the head of Lucky Media, will be at the forefront of presenting new types of movies to the audience. Bekkem Venugopal, who has produced youthful entertainers like Cinema chupista Mama, Mem Vayasuki Vachhaam, Husharu, liked the story told by debutant director Pranava Swaroop and is producing a romantic thriller with a new banner called Riya Ziya Productions. Nandu, who is well known to everyone, acted as the hero and Avika Gor, who was introduced to the Telugu screen with the movie Uyyala Jampala and who won the praise…

రాంచరణ్ తో సాయిపల్లవి!

Sai Pallavi with Ramcharan!

రామ్‌ చరణ్‌ ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాడు. ఓవైపు ‘గేమ్‌ ఛేంజర్‌’తో బిజీగా ఉంటూనే.. మరోవైపు బుచ్చిబాబు సినిమాకి సంబంధించిన కథా చర్చల్లో పాలు పంచుకొంటున్నాడు. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు దర్శకత్వంలో చరణ్‌ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీస్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇందులో కథానాయికగా సాయి పల్లవిని ఎంచుకొనే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇది వరకు శ్రీలీల పేరు బయటకు వచ్చింది. ఆమె స్థానంలోకి సాయి పల్లవి వచ్చిందా? లేదంటే ఈ చిత్రంలో ఇద్దరు కథానాయికలా? అనే సంగతి తెలియాల్సివుంది. 1980 నేపథ్యంలో సాగే పిరియాడిక్‌ చిత్రమిది. స్పోర్ట్స్‌ డ్రామాగా తెరకెక్కించనున్నారు. రెహమాన్‌ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. చెన్నైలో ప్రస్తుతం మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ జరుగుతున్నాయి. 2024 సంక్రాంతికి ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.

అవేవీ నన్ను బాధించలేవు : అలియాభట్‌

None of that can hurt me: Alia Bhatt

రణబీర్‌కి లిప్‌స్టిక్‌ నచ్చదు. నేను వేసుకుంటే కూడా ఊరుకోడు. తీసేయ్‌మని గొడవ చేస్తాడు. ఆ విషయాన్నే ఓ ఇంటర్‌వ్యూలో చెప్పాను. దానికి పెడార్థాలు తీస్తూ రణబీర్‌ నన్ను వేధిస్తున్నాడని ఏవేవో రాసేశారు. నిజానికి రణబీర్‌ చాలామంచి మనిషి. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. నాపై రాసినా నేను బాధపడను. అవి నన్ను బాధించలేవుకూడా. కానీ తనపై రాశారు. అప్పుడు మాత్రం బాధ అనిపించింది’ అని అలియాభట్‌ ఆవేదన వ్యక్తం చేసింది. ఇటీవల ఆమె కరణ్‌జోహార్‌ టాక్‌షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ కార్యక్రమంలో కరీనాకపూర్‌తో కలిసి పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘చేతిలో ఫోన్‌ ఉన్న ప్రతివాడూ ప్రస్తుతం జర్నలిస్టే. రూమర్లు పుట్టిస్తూనే ఉంటారు. నేను సన్నగా మారటానికి, నా చర్మాన్ని తెల్లగా మార్చుకోటానికి కొన్ని సర్జరీలు చేయించుకున్నానంట. ఆమధ్య ఈ వార్త సోషల్‌మీడియాలో బాగా ట్రోల్‌…

ఆయన సలహాలు వింటానంటోంది మెహరీన్‌!?

Mehreen wants to listen to his advice!?

‘కృష్ణగాడి వీరప్రేమగాధ’ సినిమాలో మెహరీన్‌ను చూసిన అందరూ కాజల్‌ చెల్లెలా? అనే అనుమానం వ్యక్తం చేశారు. బొద్దుగా, ముద్దుగా ఆ సినిమాలో చాలా అందంగా కనిపించింది మెహరీన్‌. ఆ తర్వాత ఏమైందో.. బొద్దుగా ఉంటే అవకాశాలు రావని ఎవరైనా చెప్పారేమో తెలియదు కానీ.. ఉన్నట్టుండి తగ్గిపోయి సన్నగా తయారైంది. ఓ దశలో జీరో సైజ్‌కి మారిపోయింది కూడా. నిజానికి బొద్దుగా ఉన్నప్పుడున్న అందం సన్నబడ్డాక కనిపించడంలేదని చాలామంది అభిప్రాయపడ్డారు. ఇక రీసెంట్‌గా విడుదలైన ‘స్పార్క్‌ లైఫ్‌’ సినిమాలో మెహరీన్‌ అటు బొద్దుగా కాకుండా, ఇటు సన్నగా లేకుండా మధ్యస్థంగా ముద్దుగా కనిపించింది. ఇటీవలే ఆమె దర్శకుడు మారుతిని కలిసింది. మెహరీన్‌ను చూసిన మారుతీ.. ‘ఇప్పుడు చాలా బావున్నావు. నా ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమాలో చాలా సన్నగా ఉన్నావు. ఇదే మెయింటెయిన్‌ చెయ్‌’ అన్నాడట. మారుతీ సలహాని పాటిస్తానని,…

సొంతంగా యూట్యూబ్‌ ప్రారంభించిన నాగచైతన్య!

Naga Chaitanya started his own YouTube!

ఈ ఏడాది కస్టడీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన టాలీవుడ్‌ యాక్టర్‌ నాగచైతన్య ప్రస్తుతం చందూమొండేటి దర్శకత్వంలో 23 సినిమాతో బిజీగా ఉన్నాడు. చైతూ ఓ వైపు ప్రొఫెషనల్‌గా బిజీగా ఉంటూనే.. మరోవైపు సొంతంగా యూట్యూబ్‌ ఛానల్‌ ను ప్రారంభించాడు. ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు తమకు సంబంధించిన విశేషాలను సోషల్‌ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఎక్స్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌తోపాటు యూట్యూబ్‌ ద్వారాను ప్రేక్షకులకు చేరువలో ఉంటున్నారు. వారికి సంబంధించిన చిత్ర ప్రమోషన్స్‌ను కూడా ఈ వేదికల ద్వారా ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి చైతూ వచ్చి చేరాడు. ‘అక్కినేని నాగచైతన్య’ పేరుతో ఛానల్‌ను రూపొందించి ఆయన.. అందులో శుక్రవారం ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. యూట్యూబ్‌ ప్రపంచంలోకి అడుగుపెట్టానంటూ వెల్లడించాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర జవాబులు…