శ్రీ వైష్ణవి పొడక్షన్స్..ఎస్.ఆర్.కె బ్యానర్ పై సాయి రోహిత్ గోనె దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’. ఈ చిత్రానికి ఎస్.ఆర్.కె – జి.ఎన్.కె నిర్మాతలు. నరేష్, మౌనియాదవ్, డార్లింగ్ వెంకీ, సాయి రోహిత్ గోనె ప్రధాన పాత్రధారులుగా నటించిన ఈ చిత్రానికి సంబంధించి నిర్మాణానంతర పనులన్నీ విజయవంతగా పూర్తయ్యాయి. మెరుపు వేగంతో విడుదలకు సన్నద్ధమవుతోంది.
ఈ సందర్బంగా దర్శకుడు సాయి రోహిత్ గోనె చిత్ర విశేషాలను వివరిస్తూ -”అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చే అంశాల సమ్మేళనంతో ఈ చిత్రం సాగుతుంది. ఇందులో బాగా నటించడానికి అవకాశం ఉన్న విభిన్న కోణాలు కలిగిన పాత్రలను నటీనటులు చక్కగా పోషించారు. ఆయా పాత్రల్లో వారు పరకాయప్రవేశం చేసి తమ పాత్రలకు పూర్తి న్యాయంచేశారు. అనుకున్నది అనుకున్నట్టుగానే చిత్రం చాలా బాగా వచ్చినందుకు ఓ దర్శకుడిగా ఎంతో ఆనందంగా ఉంది. ఇంత చక్కగా చిత్రం రావడంలో యూనిట్ సహకారం మరచిపోలేనిది. ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఉంటుంది. మా అంచనాలను ఈ చిత్రం నిలబెడుతుంది. ఆ నమ్మకం మాకుంది. ఓ చక్కటి కథతో ఈ చిత్రాన్ని రూపొందించాం. సినిమాను విభిన్నరీతిలో..వినూత్నంగా చూపిస్తున్నాం. వైవిధ్యమైన స్క్రీన్ ప్లేతో అద్భుతమైన టెక్నికల్ వ్యాల్యూస్ తో ఈ చిత్రాన్ని మలిచాం. ఇంటిల్లిపాదికి వినోదాన్ని అందించే చిత్రమిది. వినోద ప్రియులు మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కు ఆనందాశ్చర్యాలను కలిగించడానికి ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’ సిద్ధమైంది. ప్రేక్షకులకు పూర్తి వినోదాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్ రూపుదిద్దుకుంది. డ్రామా, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని అంశాలతో మొత్తం కుటుంబానికి సమగ్రమైన వినోదం అందించనున్నాం. ఇది కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. కథే హీరో అండ్ విలన్. చిత్రాన్ని ఉన్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించాం. శ్రీకాంత్ మిండి డి.ఓ.పి -ఎడిటింగ్, సరవ్ సంగీతం, ప్రభాత్ పాటలు, ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్స్ ఈ ‘అలా మొదలై.. ఇలా ముగిసింది’ చిత్రానికి ఆయువుపట్టుగా నిలుస్తాయి. కంటెంట్ ఉండే సినిమాలకు మన తెలుగు ఆడియన్స్ ఎప్పుడూ బ్రహ్మరథం పడతారు. కాబట్టి ఈ చిత్రాన్ని కచ్చితంగా ఆదరిస్తారనే కాన్ఫిడెన్స్ మాకుంది” అన్నారు. ఈ చిత్రానికి కథ: నరేష్ కుమార్, పాటలు: ప్రభాత్, సంగీతం: సరవ్ డి.ఓ.పే – ఎడిటింగ్: శ్రీకాంత్ మిండి నిర్మాతలు:ఎస్.ఆర్.కె – జి.ఎన్.కె, స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: సాయి రోహిత్ గోనె.