పాపులర్ కమెడియన్ మధునందన్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘గుండె కథ వింటారా’. వంశీధర్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని ట్రినిటి పిక్చర్స్ పతాకంపై క్రాంతి మంగళంపల్లి, అభిషేక్ చిప్ప సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మధునందన్ సరసన స్వాతిస్ట కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ చిత్రం నుండి `ఎంత బావుందో…` లిరికల్ సాంగ్‌ని విజయ్‌దేవరకొండ రిలీజ్చేసి చిత్ర యూనిట్‌కి ఆల్ ది బెస్ట్ తెలిపారు. `ఎంత బావుందో..పక్కనే ఉన్నా మనసులో మాట చెప్పలేకున్నా…గుప్పెడుగుండె తట్టింది ఎవరో నాకు చెప్పింది..పైకే చెప్పనంటోంది హాయో మాయో అంతా కొత్తగా ఉంది ఐనా ఇదే బాగుంది బహుశా ఎదురుపడనంది` అంటూ సాగే ఈ సోల్ ఫుల్ మెలొడీకి మసాలా కాఫీ సంగీతం సమకూర్చగా కృష్ణ చైతన్య సాహిత్యం అందించారు. కృష్ట జెకే, వరుణ్ సునీల్ ఆహ్లాదంగా ఆలపించారు.
Related posts
-
వృషకర్మ నా కెరీర్లో 100% బెస్ట్ మూవీ అవుతుంది. చివరి 30 నిమిషాల క్లైమాక్స్ ఇండియన్ సినిమాలో బెంచ్ మార్క్ సెట్ చేస్తుంది: గ్లింప్స్ లాంచ్ ఈవెంట్ లో యువ సామ్రాట్ నాగ చైతన్య
Spread the love యువ సామ్రాట్ నాగ చైతన్య, కార్తీక్ దండు, SVCC, సుకుమార్ రైటింగ్స్ ‘నెవర్ బిఫోర్ మిథికల్ థ్రిల్లర్... -
రెమ్యూనరేషన్ లో తగ్గేదే లేదు .. వరుస హిట్స్ తో ఫుల్ జోష్!
Spread the love దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండు దశాబ్దాలుగా... -
మూడేళ్ల వివాహా బంధాన్ని ఘనంగా సెలెబ్రేట్ చేసుకున్న మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి
Spread the love మంచు మనోజ్, భూమా మౌనికా రెడ్డి ఈ రోజు (మార్చి 3) తమ మూడవ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు....
