ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులను అరికట్టాలి

Spread the love

బీజేవైఎం ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం
విద్యా సంస్థల్లో వెంటనే జీ.వో నెం.46 అమలు చేయాలని డిమాండ్

టాలీవుడ్ టైమ్స్ న్యూస్: ఆలేరు
తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు విద్యా సంస్థలు వసూలు చేస్తున్న అధిక ఫీజులను అరికట్టాలని కోరుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో బీజేవైఎం ఆధ్వర్యంలో స్ధానిక తహశీల్దార్ గణేష్ నాయక్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షులు సంగు భూపతి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేటు మరియు కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని అన్నారు, కరోనాతో ఆర్థికంగా నష్టపోయిన విద్యార్థుల తల్లిదండ్రులకు ఫీజులు చెల్లించడం భారం అయిపొయిందని ఆయన చెప్పారు, రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంస్థల్లో వెంటనే జీ.వో నెంబర్ 46 అమలు చేయాలని డిమాండ్ చేశారు, ఈ కార్యక్రమంలో కందుల శంకర్, తునికి అరవింద్, కొమ్ము శ్రవణ్, కటకం వెంకటేష్, చింతకింది అర్జున్, సముద్రాల యశ్వంత్, గజరాజుల దినేష్ , పల్ల శ్రీధర్, అన్నంపట్ల సందీప్, శివాజీ, శ్యామ్, అనిల్, శివమాధవ్తో పాటు బీజేవైఎం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment