దుల్క‌ర్ స‌ల్మాన్‌ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా హ‌ను రాఘ‌వ‌పూడి, స్వ‌ప్న సినిమా, వైజ‌యంతి మూవీస్ లెఫ్ట్‌నెంట్ రామ్‌ గ్లిమ్స్ విడుద‌ల‌

dulquer Salman, Hanu Raghavapudi, Swapna Cinema, Vyjayanthi Movies- Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled
dulquer Salman, Hanu Raghavapudi, Swapna Cinema, Vyjayanthi Movies- Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled
Spread the love

వెర్స‌టైల్ యాక్ట‌ర్ దుల్క‌ర్ స‌ల్మాన్ గురించి తెలుగు ప్రేక్ష‌కుల‌కి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. తెలుగులో ఆయ‌న న‌టించిన మొద‌టి సినిమా మ‌హాన‌టి ఘ‌న విజ‌యం సాధించింది. ఇప్పుడు అదే బేన‌ర్ స్వ‌ప్న సినిమా ప‌తాకంపై దుల్క‌ర్ స‌ల్మాన్ హీరోగా మ‌రో సినిమా రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రంలో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్‌ స‌ల్మాన్ న‌టిస్తున్నారు. సెన్సిబుల్ డైరెక్ట‌ర్ హను రాఘవపూడి దర్శకత్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత అశ్వినిద‌త్ నిర్మిస్తున్నారు.
ఈ రోజు (జులై28) దుల్కర్ బర్త్ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ తాజాగా ఓ గ్లిమ్స్ ని విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. ఈ గ్లిమ్స్‌లో లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్క‌ర్ స‌ల్మాన్ ఆక‌ట్టుకున్నారు. ఇది త‌న బ‌ర్త్‌డేకి ప‌ర్‌ఫెక్ట్ గిఫ్ట్ అని దుల్క‌ర్ తెలిపారు.
పీరియ‌డ్ ల‌వ్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆయ‌న సార‌థ్యంలో కాశ్మీర్‌లోని ప‌లు అంద‌మైన లోకేష‌న్స్‌లో కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రించారు.
హార్ట్ ట‌చింగ్ రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్స్ తెర‌కెక్కించ‌డంలో ప్ర‌సిద్ది చెందిన హను రాఘ‌వ‌పూడి మ‌రో ఆస‌క్తిక‌ర అంశాల‌తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
ఈ సంద‌ర్భంగా విడుద‌ల‌చేసిన పోస్ట‌ర్లో దుల్క‌ర్ స‌ల్మాన్ చేతిలో ఒక లెట‌ర్ ప‌ట్టుకుని న‌వ్వుతూ సైకిల్‌మీద కూర్చొని ఉన్నాడు.
భారీ బ‌డ్జెట్‌తో ఈ చిత్రం తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ భాష‌ల‌లో రూపొందుతోంది.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖ‌ర్ సంగీతం స‌మ‌కూరున్నారు.

తారాగ‌ణం:
దుల్క‌ర్ స‌ల్మాన్‌

సాంకేతిక నిపుణులు:
క‌థ‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: హ‌ను రాఘ‌వ‌పూడి
నిర్మాత‌: ప్రియాంక‌ద‌త్‌
బ్యాన‌ర్‌: స్వ‌ప్న సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: వైజ‌యంతి మూవీస్‌
సంగీతం: విశాల్ చంద్ర‌శేఖ‌ర్
సినిమాటోగ్రాఫ‌ర్‌: పీఎస్ వినోద్‌
ఎడిట‌ర్: కోట‌గిరి వెంకటేశ్వ‌ర రావు
ఆర్ట్‌: వైష్ణ‌వి రెడ్డి
ప్రొడ‌క్ష‌న్ డిజైన్‌: సునీల్ బాబు