-టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ లలో వీక్షకులను అలరించనున్న ‘మేక్‌మీ అప్’ – హంగామా ఒరిజినల్స్
డిజిటల్ యుగం ప్రారంభమై అన్ని రంగాలలోకి అత్యంత వేగంగా చొచ్చుకుపోతున్న విషయం తెలిసిందే. మేకప్ రంగంలోనూ డిజిటల్ హంగులను ప్రవేశపెట్టాయి హంగామా ఒరిజినల్స్, టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఛానెల్స్. ఇది భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ మేకప్ రియాలిటీ షో గా చెప్పవచ్చు. ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులలోని ప్రతిభను వెలికి తీసేందుకు, వారు తమ కళను సజీవంగా ఉంచుకునేందుకు ఉపయుక్తంగా ఉండేలా టాలెంట్ హంట్ షో నిర్వహిస్తున్నారు. ఈ నెల 10వ తేదీ నుంచే ప్రసారమవుతున్న ది. ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందుతోంది.
హంగామా డిజిటల్ మీడియా యాజమాన్యంలోని ప్రముఖ వీడియో ఆన్ డిమాండ్ ప్లాట్‌ఫారమ్ అయిన హంగామా ప్లే, భారతదేశం యొక్క మొట్టమొదటి లిస్టెడ్ ఈవెంట్ మేనేజ్‌మెంట్ ఆర్గనైజేషన్, టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ సహకారంతో, ఈరోజు భారతదేశపు మొట్టమొదటి డిజిటల్ మేకప్ రియాలిటీ షో ‘మేక్ మీ అప్’ని ప్రకటించింది. డిసెంబర్ 10, 2021న ప్రత్యక్ష ప్రసారం అయిన ఈ రియాలిటీ టాలెంట్ హంట్ షో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నది. ఈ షో
వెనుక ఉన్న ఆలోచన ఒక్కటే. యువ మేకప్ ఆర్టిస్టులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఆసక్తికరమైన, విశ్వసనీయమైన వేదికను అందించడం. దేశవ్యాప్తంగా ఉన్న యువ కళాకారుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్ది, సరికొత్త మేకప్ ఆర్టిస్ట్ లుగా ఆవిష్కరించడమే. ఇందుకోసం దేశవ్యాప్తంగా నిర్వహించిన ఆడిషన్స్ లో పదహారు మంది ఎంపికయ్యారు. మొదటి ఎనిమిది ఎపిసోడ్‌లలో ఇద్దరు మేకప్ ఆర్టిస్టుల మధ్య ముఖాముఖి ఉంటుంది. మొత్తం ఎనిమిది ఎపిసోడ్‌లలోని విజేతలు ఎలిమినేషన్‌కు వెళతారు. వారిలో నలుగురు సెమీ-ఫైనల్‌కు చేరుకుంటారు. చివర్లో, ఇద్దరు ఫైనల్ రౌండ్‌కు వెళతారు. అక్కడ ‘మేక్‌మీ అప్ ఆర్టిస్ట్ ఆఫ్ ది ఇయర్’ ప్రకటించబడుతుంది. టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ షో కు కరుణ్ పంచి దర్శకత్వం వహించారు.
“మేక్ మీ అప్” అనేది గ్లామర్, గ్లిట్జ్ ఆండ్ డ్రామా. అన్ని భావోద్వేగాలకు ఒకటే వేదిక అని చెప్పవచ్చు.! ఇది ట్యుటోరియల్‌ల కోసం, మేకప్ ఛానెల్‌ల కోసం అన్వేషిస్తున్న ఔత్సాహిక మేకప్ ఆర్టిస్టులు, యువ ప్రేక్షకులను ఆకట్టుకునే ఒక అద్భుతమైన సిరీస్. అందాల ప్రదర్శన, ఫ్యాషన్ ప్రపంచంలో పేరొందిన ప్రముఖులు ఈ ప్రదర్శనకు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. న్యాయనిర్ణేతలలో ఒకరుగా వ్యవహరించనున్న చాందినీ సింగ్, మేకప్ రంగంలో అనుభవజ్ఞులు. పేరొందిన వారు. ఆమె ఈ ప్రత్యేక షో అంతటికీ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తారు. అలాగే ప్రతి ఎపిసోడ్ కు మరో న్యాయనిర్ణేత అతిథిగా వస్తుంటారు. అతిథి న్యాయ నిర్ణేతలు గా వారం వారం పాల్గొనబోయేవారు ఇప్పటికే సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ ఉన్నవారు కావడం విశేషం. ఈ న్యాయమూర్తులు వారి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ పోటీదారులకు మార్గనిర్దేశం చేస్తారు. అతిథి న్యాయనిర్ణేతల పేర్లలో అను కౌశిక్, గుణీత్ విర్ది, లీనా భూషణ్, కృతి Ds, సాహిల్ మల్హోత్రా, గోమిత్ చోప్రా, ఇజా సెటియా, చాందినీ గిర్ధర్, ప్రతీక్ సచ్‌దేవా, పరమ సాహిబ్ వంటివారు ఉన్నారు.
తొలిసారిగా డిజిటల్ రియాలిటీ స్పేస్‌లోకి ప్రవేశించడం గురించి హంగామా డిజిటల్ మీడియా COO సిద్ధార్థ రాయ్ మాట్లాడుతూ, “హంగామాలో, విభిన్నమైన, ఆకర్షణీయమైన అంశాల చుట్టూ ఉన్న భావోద్వేగమైన కథనాల కోసం మేము నిరంతరం వెతుకుతూ ఉంటాము. టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌తో అనుసంధానించబడినందుకు మేము సంతోషిస్తున్నాము. వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్యూటీ ఇండస్ట్రీ ప్రాధాన్యతను గుర్తించి,
“మేక్ మీ అప్” షో రూపొందించాం. టీవీ రంగంలోనూ నాన్-ఫిక్షన్ ప్రోగ్రామింగ్ లకు ఆదరణ పెరుగుతున్నందున, స్క్రిప్ట్‌తో కూడిన వాస్తవికతలోకి మా ప్రయాణం సాగించాలనుకుంటున్నాం. మాకు ఉన్న విభిన్నమైన అభిరుచి, ఇంకా బలమైన కంటెంట్ కేటలాగ్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది. ప్రభావశీలులతో అందించబడినందున ఇది ప్రేక్షకులను కచ్చితంగా కట్టిపడేస్తుంది. ఇది లీనియర్ టెలివిజన్‌కి సరిగ్గా సరిపోతుంది. ఈ రియాలిటీ షో కు అనేక మంది కొత్త వీక్షకులు ట్యూన్ అవుతారు. మేక్ మీ అప్ ఫ్యాషన్ మరియు బ్యూటీ పరిశ్రమపై దృష్టి సారిస్తుంది. మేము ప్రేక్షకుల సంఖ్యను పెంచుకోగలిగేలా కంటెంట్‌ను వైవిధ్యపరచడంతోపాటు క్యూరేట్ చేస్తాము.”
హంగామా ఒరిజినల్స్‌తో అనుబంధం గురించి మరింతగా వ్యాఖ్యానిస్తూ, టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్‌లో మేక్‌మీఅప్ & క్రియేటివ్ డైరెక్టర్ వ్యవస్థాపకురాలు కనికా బబ్లానీ మాట్లాడుతూ, టచ్‌వుడ్ ఎంటర్‌టైన్‌మెంట్ మొట్టమొదటిసారిగా డిజిటల్ మేకప్ రియాలిటీ షో మేక్ మీ అప్ కోసం హంగామాతో కలిసి పని చేస్తున్నందుకు సంతోషిస్తోంది. Make Me Upతో మేము మా వీక్షకులకు ప్రత్యేకమైన అపుభూతిని అందించగలుగుతాము. అందం పరిశ్రమ చాలా వైవిధ్యమైనవి. అన్ని రకాల ఔత్సాహిక మేకప్ కళాకారులకు గుర్తింపును అందించడంప్నే మా దృష్టి ఉంటుంది. అందాల పరిశ్రమలో సేవలను అందించే వారిపై ఉన్న మూస పద్ధతిలో ఉన్న భావాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఇంకా వారి ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించడానికి వారికి గొప్ప వేదిక కల్పిస్తోంది.