ఘనంగా ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవం

photograhfe day
Spread the love

ఫోటో ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ సందర్భంగా గురువారం నాడు తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ (TUWJ అనుబంధ సంస్థ)  ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను రాష్ట్ర ఆబ్కారీ, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ హాజరయ్యారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ఫోటో జర్నలిస్టులు ఉత్తమ ఫోటోల ఎంపిక పోటీలో ఫోటోలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తెలంగాణోద్యమంలో ఫోటో జర్నలిస్టులు పోషించిన పాత్ర చరిత్రాత్మకమైనదని కొనియాడారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సంక్షేమానికి సిఎం కేసిఆర్ పలు చర్యలు చేపడుతున్నట్లు ఆయన చెప్పారు.
టీయుడబ్ల్యుజె నేత విరాహత్ అలీ మాట్లాడుతూ ప్రతి ఏటా ఆనవాయితీగా ఉత్తమ ఫోటోల ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఫోటో జర్నలిస్టుల్లో నైపుణ్యాన్ని వెలికితీస్తున్న TSPJAను ఆయన అభినందించారు. ప్రపంచ ఫోటో గ్రఫీ దినోత్సవ సందర్భంలో రాష్ట్రంలోని ఫోటో జర్నలిస్టులకు విరాహత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమనికి రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ అధ్యక్షత వహించగా, తెలంగాణ రాష్ట్ర ఫోటో జర్నలిస్టుల అసోసియేషన్ రాష్ట్ర నాయకులు కె.అనీల్ కుమార్, గ్రేటర్ హైదరాబాద్ జిల్లా యూనిట్ అధ్యక్షులు ఆనంద్ ధర్మాన, ప్రధాన కార్యదర్శి వీరగోని రజినీకాంత్, నాయకులు ఎన్.శివ కుమార్, దీపక్
దేశ్ పాండే, సురేందర్ రెడ్డి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment