అక్రిడేషన్ జీవోలో జీ.ఎస్.టి తొలగించాలి

press
Spread the love

మచ్చా రామలింగారెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు,
ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ (APWJU)

  • ఏ.పీ ప్రెస్ అకాడమీ కార్యవర్గం కమిటీ ఏర్పాటు చేయాలి
  • 28 నుంచి రాష్ట్రంలో సభ్యత్వ నమోదు
  • చిన్న పత్రికలకు అక్రిడేషన్ లో అన్యాయం జరుగుతుంది
  • వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు ఇవ్వాలి
  • కరోనాతో మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలి
  • రాష్ట్రంలో కొత్త అక్రిడేషన్లు మంజూరు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్రిడేషన్ జీవో లో జీఎస్టీ తొలగించాలని మచ్చా రామలింగారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ డిమాండ్ చేశారు.
  • అనంతపురం నగరంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నందు ఈరోజు విలేకరుల సమావేశంలో మచ్చా రామలింగారెడ్డి మాట్లాడారు.
  • అక్రిడేషన్ మంజూరులో చిన్న పత్రికలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని వెంటనే జిఎస్టి తొలగించాలని గతంలో మాదిరిగా వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ అక్రిడేషన్లు మంజూరు చేయాలని కోరారు.
  • ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి వెంటనే కార్యవర్గాన్ని సభ్యులను ఏర్పాటు చేయాలని తెలంగాణ మాదిరిగానే ఏపీలో కూడా ప్రెస్ అకాడమీ ద్వారానే జర్నలిస్టుల సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించాలని రెండు సంవత్సరాలు కావస్తున్నా ప్రెస్ అకాడమీ కార్యవర్గం లేకపోవడం ఆందోళన కలిగించే అంశం మచ్చా అన్నారు.
  • రాష్ట్రంలో కరోనాతో మృతిచెందిన జర్నలిస్టు కుటుంబాల్ని వెంటనే ఆదుకోవాలని ఇంటి పెద్ద కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ జర్నలిస్టుల సమస్యలపై దృష్టి పెట్టాలని మచ్చా రామలింగారెడ్డి డిమాండ్ చేశారు.
  • జర్నలిస్టులకు అక్రిడేషన్ ప్రభుత్వాల భిక్ష కాదనీ జర్నలిస్టు హక్కుని జర్నలిస్టులు అందరూ ఐకమత్యంగా పోరాడాలని వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రిడేషన్లు ఇవ్వాల్సిందేనని మచ్చా అన్నారు.
  • 28వ తారీకు నుంచి అనంతపురం నగరంలో ప్రెస్ క్లబ్ నందు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభిస్తామని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
  • రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లు, ఫోటోగ్రాఫర్లు, సబ్ ఎడిటర్లు, చిన్న పత్రికల ఎడిటర్లు, అందరూ సభ్యత్వం తీసుకుని జర్నలిస్టుల ఉద్యమంలో భాగస్వాములు కావాలని మచ్చా రామలింగారెడ్డి కోరారు.
  • విలేకర్ల సమావేశంలో వెంకటేశ్వర్లు, విజయరాజు, ఆంధ్రప్రభ రాజా, షాకీర్, జానీ, బాలు, శ్రావణ్, ఉపేంద్ర, చలపతి, మల్లికార్జున తదితర సభ్యులు పాల్గొన్నారు.

Related posts

Leave a Comment