ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన అంశంలో టాలీవుడ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో ఏపీ పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ.. విచారణకు హాజరుకాని వర్మ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశాడని తెలిసిందే. తాజా ఈ కేసులో రాంగోపాల్ వర్మకు ఏపీలో హైకోర్టులో ఊరట లభించింది. ఇటీవల ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఆర్జీవీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం (ఈ నెల 9)వరకు వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. కోర్టు తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. తనపై రాజ్యాంగ విరుద్ధంగా కేసు పెడుతున్నారని ఆర్జీవీ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను కామెంట్ చేసిన వ్యక్తులు కాకుండా.. సంబంధం లేని వ్యక్తులు తనపై కేసులు పెట్టారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తనపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయకుండా ఆదేశాలు జారీచేయాలని కోర్టుకు నివేదించాడు వర్మ. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..”నేను పారిపోలేదు.. హైదరాబాద్‌లోని డెన్‌లో ఉన్నా. నాపై ఐదు కేసులు పెట్టడం వెనుక కుట్ర ఉంది. నా రిప్లైపై పోలీసులు స్పందిస్తే విచారణకు వెళ్తానన్నాడు. అరెస్ట్ చేస్తారనే ముందస్తు బెయిల్ పిటిషన్ వేశా. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ట్వీట్లు పెట్టా. నా ట్వీట్ల వెనుక రాజకీయ దురుద్దేశం లేదని క్లారిటీ ఇచ్చాడు. మరి దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారనేది చూడాలి. ఈ కేసు ఏమైనా ఎమర్జెన్సీ కేసా? ఏడాది తర్వాత ట్వీట్ చూసిన అతనికి వారంలో అన్నీ అయిపోవాలనడంలో ఏమైనా అర్థం ఉంటదా అసలు.. హత్యకేసుల్లాంటి వాటికి సంవత్సరాలు తీసుకొని.. ఇప్పుడు ఎమర్జెన్సీ కేసుల కంటే ముందే వీటిని విచారించడమేంటని తనదైన శైలిలో కౌంటర్ వేయగా.. ఇప్పటికే ఈ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.
Related posts
-
ఈ సినిమాలో కృష్ణుడే సూపర్ స్టార్, కంటెంటే సూపర్ స్టార్ : ‘డియర్ కృష్ణ’ ప్రెస్ మీట్ లో నిర్మాత పి.ఎన్. బలరామ్
Spread the love పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై రూపొందుతోన్న యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ‘డియర్ కృష్ణ’. ఈ సినిమా ద్వారా... -
ఆ డైరెక్టర్‌తో చిరంజీవి మెగా ప్రాజెక్టు!?
Spread the love ఒక్క సినిమా డైరెక్ట్ చేసిన వశిష్టకు, తన సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చేశారు చిరంజీవి. ఆ సినిమానే... -
హైదరాబాద్ నడిబొడ్డున ‘పుష్ప’ వైల్డ్ ఫైర్ జాతర!
Spread the love ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాలతో పుష్ప 2 ప్రేక్షకుల...