‘కంగువా’ డబ్బింగ్‌లో ఏఐ ఉపయోగం : నిర్మాత కే.ఈ జ్ఞానవేల్‌

Use of AI in the dubbing of 'Kangua': Producer KE Gnanavel reveals
Spread the love

సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’ శివ దర్శకత్వంలో రూపొందుతుంది. నవంబర్‌ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఫాంటసీ యాక్షన్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమా గురించి నిర్మాత కే.ఈ జ్ఞానవేల్‌ ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. తాజాగా ఎక్స్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించిన ఆయన ‘కంగువా’లో ఏఐని ఉపయోగించినట్లు చెప్పారు. ‘కంగువా’ను ఏకంగా 8 భాషల్లో ఒకేసారి రిలీజ్‌ చేయనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నిర్మాత ఓ విషయం పంచుకున్నారు. తమిళ వెర్షన్‌కు సూర్య డబ్బింగ్‌ చెప్పగా.. మిగతా భాషల్లో ఏఐ సాయంతో డబ్బింగ్‌ పనులు పూర్తి చేయనున్నాం. డబ్బింగ్‌ పనుల కోసం కోలీవుడ్‌లో ఏఐని ఉపయోగించడం ఇదే తొలిసారి. ఇటీవల విడుదలైన ‘వేట్టయన్‌’లో అమితాబ్‌బచ్చన్‌ వాయిస్‌లో మార్పుల కోసం ఏఐను ఉపయోగించారు. ఇప్పుడు పూర్తిగా డబ్బింగ్‌ కోసం మేం దీన్ని ప్రయోగిస్తున్నాం. ఇది విజయవంతమవుతుందని భావిస్తున్నాం. ఈ చిత్రం అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లిష్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌లలో విడుదల కానుంది. చైనీస్‌, జపనీస్‌ విడుదల తేదీలను కూడా త్వరలోనే ప్రకటిస్తాం అని నిర్మాత జ్ఞానవేల్‌ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1000 కోట్ల కలెక్షన్స్‌ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు నిర్మాత ఇటీవల చెప్పారు. పార్ట్‌ 2, పార్ట్‌ 3 కథలు సిద్ధంగా ఉన్నాయని.. పార్ట్‌ 1 విజయం ఆధారంగా వాటిని తెరకెక్కించేలా ప్లాన్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ సినిమా సూర్యని మరో స్థాయికి తీసుకెళ్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. యాక్షన్‌తోపాటు ఎమోషన్స్‌కు ఇందులో అధిక ప్రాధాన్యం ఉందన్నారు. త్రీడీలోనూ అలరించనున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. కంగ అనే ఓ పరాక్రముడి కథతో ఈ సినిమా సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. దిశా పఠానీ కథానాయిక. బాబీ డియోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Related posts

Leave a Comment