‘విశ్వం’ ఇద్దరికీ పరీక్షే!

'Universe' is a test for both!
Spread the love

మాచో స్టార్‌ గోపీచంద్‌ , దర్శకుడు శ్రీను వైట్ల కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్‌ యాంటిసిపేటెడ్‌ సినిమా ‘విశ్వం’ ఇటీవల విడుదలైన టీజర్‌కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వచ్చింది. సినిమాపై అంచనాలు మరింత పెంచింది. ఈ భారీ బ్జడెట్‌ మూవీని దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోస్‌, పీపుల్‌ విూడియా పతాకాలపై వేణు దోనేపూడి, టీజీ విశ్వ ప్రసాద్‌ ప్రొడ్యూస్‌ చేస్తున్నారు. ఇందులో రెండో పాటను తాజాగా విడుదల చేశారు. గోపీచంద్‌ సరసన కావ్య థాపర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న లేటెస్ట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’లో ఫస్ట్‌ సింగిల్‌ ’మొరాకో మగువకు’ అనే పాట చార్ట్‌ బస్టర్‌ రెస్పాన్స్‌ తో అదరగొట్టింది. రీసెంట్‌ గా ఫస్ట్‌ సింగిల్‌ తో మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ మొదలు పెట్టిన ‘విశ్వం’ టీం మంగళవారం ఈ సినిమాలోని సెకండ్‌ సాంగ్‌ ను రిలీజ్‌ చేసింది. ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ అనే ఈ పాట మదర్‌ ఎమోషన్‌ తో అద్భుతంగా ఉంది. ఈ హార్ట్‌ టచింగ్‌ సాంగ్‌ ను మ్యూజిక్‌ డైరెక్టర్‌ చేతన్‌ భరద్వాజ్‌ కంపోజ్‌ చేశారు. సినిమాలో ఉన్న లిరిక్స్‌ కూడా నెక్ట్స్‌ లెవెల్‌ అనేలా ఉన్నాయి. శ్రీ హర్ష ఈమణి ఈ పాటకు లిరిక్స్‌ రాశారు. ఇక సాహితి చాగంటి వాయిస్‌ ఈ పాటకు మరో హైలెట్‌ అని చెప్పొచ్చు. ఇక తాజాగా రిలీజ్‌ అయిన ‘మొండి తల్లి పిల్ల నువ్వు’ అనే ఈ పాట మదర్‌ డాటర్‌ సెంటిమెంట్‌ తో వచ్చింది. సాంగ్‌ సినిమాలోని ఎమోషనల్‌ డెప్త్‌ ని తెలియజేసే విధంగా ఉంది. అయితే పాపతో హీరో గోపీచంద్‌ కు ఉన్న బాండింగ్ ని మాత్రం ఈ పాటలో రివీల్‌ కాకుండా జాగ్రత్త పడ్డారు మేకర్స్‌. కానీ సాంగ్‌ విన్నాక ఇద్దరి మధ్య ఉండే ఎమోషన్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచింది. గోపీచంద్‌ గత కొంతకాలంగా వరుస డిజాస్టర్‌ లను తన ఖాతాలో వేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇక శ్రీను వైట్ల చివరి సినిమా ఏంటో కూడా ఎవ్వరికీ గుర్తులేదు. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్‌ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ’విశ్వం’. టీజర్‌ తో మంచి బజ్‌ క్రియేట్‌ చేసిన ఈ సినిమా అక్టోబర్‌ 11న గ్రాండ్‌ గా రిలీజ్‌ కాబోతోంది. మరి ఈ మూవీతోనైనా వీరిద్దరి ఖాతాలో హిట్‌ పడుతుందేమో చూడాలి.

Related posts

Leave a Comment