ఆ డైరెక్టర్ ఎప్పుడో చేసిన ప్రాజెక్టులకు ఇప్పుడు ఎక్స్ టెండెడ్ వెర్షన్స్ అనిపిస్తున్నాయి కొన్ని సినిమాలు. ఆయన ఎవరో కాదు దర్శకుడు జయశంకర్. టాలీవుడ్ లో ప్రస్తుతం వస్తున్న పలు విజయవంతమైన చిత్రాల కాన్సెప్ట్స్ ను చూస్తే అదే అనిపిస్తోంది. ఇటీవల కిరణ్ అబ్బవరానికి భారీ హిట్ ఇచ్చిన ‘క’ (KA) సినిమా చూసిన వారికి, జయశంకర్ రూపొందించిన ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’ (The God Must Be Crazy)( 2015) ప్రాజెక్ట్ ఖచ్చితంగా గుర్తుకొస్తుంది. ఆ షార్ట్ ఫిల్మ్, ఈ మూవీ చూస్తే కాన్సెప్ట్, స్క్రీన్ ప్లే దాదాపు సేమ్ టు సేమ్ అనిపిస్తాయి. ‘ది గాడ్ మస్ట్ బి క్రేజీ’లో దేవుడికి, మనిషికి మధ్య ఉన్న ఒక అత్యంత బలమైన కాన్సెప్ట్ ను జయశంకర్ ఎప్పుడో అద్భుతంగా ఆవిష్కరించారు.
అలాగే, కోలీవుడ్ యువ సంచలనం ప్రదీప్ రంగనాథన్ లేటెస్ట్ మూవీ ‘LIK’ ట్రైలర్ చూశాక ఆ సినిమా కాన్సెప్ట్ కూడా జయశంకర్ గతంలో తీసిన ‘విటమిన్ షీ’ (Vitamin She)(2020) ని పోలి ఉన్నట్టే అనిపిస్తోంది. నోమోఫోబియా (మొబైల్ ఫోన్ కు బానిసవ్వడం)కు అడిక్ట్ అయిన హీరో జీవితాన్ని, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాయిస్ అసిస్టెంట్ ఓవర్ రైడ్ చేస్తే పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉంటాయనే పాయింట్ ను ‘విటమిన్ షీ’లో చాలా ముందుచూపుతో, ఆసక్తికరంగా చూపించారు జయశంకర్. ఆయన దర్శకత్వంలో వచ్చిన రెండో సినిమా ‘అరి’ (Ari: My Name is Nobody). ఇండియాలో ఇప్పటివరకు బహుశా ఏ దర్శకుడు టచ్ చేయని ఓ విభిన్నమైన, లోతైన పాయింట్ తో ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. కానీ దురదృష్టవశాత్తూ, నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ కు సంబంధించిన వివాదం ఈ సినిమాపై తీవ్ర ప్రభావం చూపింది. ఆ ఇష్యూ వల్లే ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా చాలామందికి తెలియకుండా, తగిన గుర్తింపుకు నోచుకోకుండా పోయింది. ఇక ఈ లెక్కన చూస్తే ఆయన సినిమాలు మరెన్నో సినిమాలకు ఇన్ప్సిరేషన్ అని చెప్పక తప్పదు.
ఆ డైరెక్టర్ ఐడియాలే ఇప్పుడు సూపర్ హిట్స్!
