* కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా
* టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్
కెసిఆర్ కుటుంబం ఓ దొంగల ముఠా అని టీపీసీసీ ప్రధానకార్యదర్శి పల్లె శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. పదేళ్ల టీఆర్ ఎస్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతికి అంతం లేదని పేర్కొన్నారు, భూముల అమ్మకాలు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పనుల్లో అవినీతి జరిగినా కాళేశ్వరం అవినీతి అనకొండ అని ఆయన పేర్కొన్నారు, వాటాల పంపకాల తేడాతోనే కే సీ ఆర్ కుటుంబం లో అంతర్గత కుమ్ములాటలు నెలకొన్నాయని చెప్పారు, కవిత చిలక పలుకులు పలుకుతూ కే సీ ఆర్ ను రక్షించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు, ముఖ్యమంత్రిగా కే సీ ఆర్ ఆజ్ఞ లేనిదే కుటుంబం లో చీమ కూడా కదలలేని పరిస్థితి ఉండే దని వివరించారు, కాళేశ్వరం లో జరిగిన దానికి కవిత చెప్పిన మాటలు నిజమైతే ఆరోజే హరీష్ రావు పై ఎందుకు చర్యలు తీసుకోలేదని గౌడ్ ప్రశ్నించారు, కాళేశ్వరం అవినీతి మీద న్యాయ కోవిధుడు పీసీ ఘోష్ పరిపూర్ణ విచారణ జరిపి వాస్త వాలను వెలికి తీసారని చెప్పారు, సమగ్ర విచారణ జరిపి కే సీ ఆర్, హరీష్ రావు లను దోషులుగా తేలారు, అందువల్ల నివేదిక ఆధారంగా అసెంబ్లీ లో చర్చ అనంతరం సిబిఐ కీ అప్ప జెప్పా మని తెలిపారు, బీజేపీ నేతలు నడ్డా, బండి సంజయ్ లు కాళేశ్వరం పై మాట్లాడారని చెప్పారు, కాంగ్రెస్ ప్రభుత్వం పదేళ్ల బీ ఆర్ ఎస్ పాపాలను వెలికి తీస్తూ ప్రక్షాళన చేస్తుంటే బీజేపీ ఆ పార్టీ తరపున వాకాల్తా పుచ్చుకుంటుందని ఆరోపించారు, కాళేశ్వరం లో కర్త, కర్మ, క్రియా అని చెప్పుకున్న కే సీ ఆర్ అవినీతి కీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు, సిబిఐ విచారణ తొ కాళేశ్వరం దొంగలకు శిక్ష వేసే అవకాశం వచ్చిందని బీజేపీ నేతలు చిత్త శుద్ధి నిరూపించుకోవాలని పల్లె శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు,