సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ప్రముఖ దర్శకులు తేజ చేతుల మీదుగా జరిగినది.
ఈ సందర్బంగా తేజ మాట్లాడుతూ… ‘ప్రేమలో రెండోసారి’ సినిమా టీజర్ చాలా బాగుంది అన్నారు. ఈ భూమి ఉన్నంతవరకు ప్రేమకు మరణం లేదని, లవ్ కంటెంట్ తో తీసిన సినిమాలు ఎప్పటికీ ఆదరణ పొందుతూనే ఉంటుందని చెప్పారు, ఈ సినిమా సక్సెస్ పొందాలని కాంక్షిస్తూ టీం మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియజేశారు. సినిమా హీరో రమణ సాకే మాట్లాడుతూ. లవ్ కంటెంట్ తో ఎన్నో విజయాలు సాధించిన తేజ గారి ద్వారా ఈ సినిమా టీజర్ రిలీజ్ కావడం ఒక యాదృచ్ఛిక మని ఆయన తీసిన సినిమా లాగానే ఈ సినిమా కూడా సక్సెస్ ని పొందుతుందని చెప్పారు . ఒక లవ్ మాత్రమే కాకుండా ఎమోషన్స్, సెంటిమెంట్స్ , ట్రెండ్ కి తగినట్లు చిత్రీకరించబడ్డాయని డైరెక్టర్ని అభినందించారు.
డైరెక్టర్ సత్య మార్క మాట్లాడుతూ.. ఈ సినిమా లేటెస్ట్ ట్రెండ్ తగ్గట్టుగా నేటి యువతీ యువకులకు బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేశామని, అక్టోబర్లో రిలీజ్ కి వెళ్తున్నామని, చిన్న సినిమాల లో పెద్ద విజయాన్ని సాధించే చిత్రం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతో గొప్ప మనసుతో తేజ గారు అడిగిన వెంటనే టీజర్ లాంచ్ కి ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు.
హీరోయిన్ వనిత గౌడ మాట్లాడుతూ.. ఈ సినిమాలో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మనసుకు హత్తుకునేలా ఉందని, కెమెరా ఫోటోగ్రఫీ చాలా బాగా వచ్చిందని, స్టోరీ మరియు మ్యూజిక్ ద్వారా ప్రతి ఒక్కరూ వారిని వారు మైమరిచి సినిమాకు కనెక్ట్ అవుతారని చెప్పారు.
ఇందులో నటీ నటులు హీరో రమణ సాకే, హీరోయిన్ వనిత గౌడ, మరియు జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, రాణి, సతీష్ సారపల్లి, చిరంజీవి, విక్టర్ , ప్రదీప్, బి ఎస్ మన్యం ,సురేష్ అవ్వరు. తదితరులు నటించారు అని పేర్కొన్నారు.
డైరెక్టర్ తేజ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ టీజర్ విడుదల .
