కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘వృషభ’. తాజాగా ఈ చిత్రం నుంచి ‘అప్పా..’అనే సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. తండ్రీ కొడుకుల మధ్య ఉండే పవిత్రమైన, గొప్ప అనుబంధాన్ని తెలియజేసే ఈ పాట సినిమాకు ఆత్మ, వెన్నెముక లాంటిది. దీంతో సినిమా ప్రమోషన్స్‌కు ఎమోషనల్ స్టార్టింగ్ దొరికినట్టయ్యింది. సామ్ సి.ఎస్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను హిందీ, కన్నడ, తెలుగులో విజయ్ ప్రకాష్.. మలయాళంలో మధు బాలకృష్ణన్ పాడగా, సాహిత్యాన్ని మలయాళంలో వినాయక్ శశికుమార్, తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి త్రిపురనేని, హిందీలో కార్తీక్ ఖుష్, కన్నడలో నాగార్జున శర్మ అందించారు. ప్రతి రైటర్ తన పాటలో తమ సంస్కృతిని మిక్స్ చేసి ఎమోషనల్ టచ్ ఉండేలా చూసుకున్నారు. వృషభ మూవీలోని పాటలు టి సిరీస్ ద్వారా విడుదలవుతున్నాయి. ఈ సినిమా సంగీత ప్రయాణం ముందుగా అప్పా పాటతో మొదలైంది. డిసెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదలవుతోన్న ఈ మూవీని నంద కిషోర్ తెరకెక్కిస్తున్నాడు. ఈ ఏడాది ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా థియేటర్స్‌లో చూడాలనుకుంటున్న సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ మూవీస్‌లో వృషభ ఒకటి. అన్నీ మాధ్యమాల్లో వృషభ ఫస్ట్ వీడియో సాంగ్ అప్ప.. హృదయాన్ని హత్తుకునేలా తండ్రీ కొడుకుల బంధాన్ని తెలియజేసే పాట, సినిమాకు ఆత్మలాంటి పాట ఇది.. అని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు నంద కిషోర్ మాట్లాడుతూ ‘వృషభ’ మ్యూజికల్ జర్నీ అప్పా పాటతో స్టార్ట్ చేశాం. ఈ సినిమా ద్వారా తండ్రీ కొడుకుల మధ్య ఉండే బలమైన, భావోద్వేగా బంధం గురించి మేం చెప్పాలని అనుకున్నాం. దాన్ని ఈ పాట ద్వారా చూపించాం. ఈ సినిమాకు ఈ పాట గుండెలాంటిది. అలాగే ప్రేక్షకులకు కథేంటో కూడా ఈ పాటతో చూపించే ప్రయత్నం చేశాం. సామ్ సి.ఎస్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇది ప్రారంభం మాత్రమే. సినిమా నుంచి మరిన్ని పాటలు విడుదలవుతాయి. సినిమా సోల్ ఏంటనేది రాబోయే పాటలతో ప్రేక్షకులకు మరింతగా అర్థమవుతుంది. సాధారణంగా కుటుంబం కోసం, పిల్లల కోసం తపన పడే తండ్రి గురించిన సినిమాలు చాలా తక్కువగానే వచ్చాయి. ఈ కథను మాత్రం తప్పకుండా చూడాల్సిందే’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సామ్ సి.ఎస్ మాట్లాడుతూ .. డైరెక్టర్ నందగారు వృషభ స్టోరీ నాకు చెప్పగానే తండ్రీ కొడుకు మధ్య ఉండే ఎమోషన్ బాగా కనెక్ట్ అయ్యింది. అప్పా..సాంగ్ కంపోజ్ చేసేటప్పుడు పాటను కంపోజ్ చేయాలనే ఆలోచనతో కాకుండా నాకు వ్యక్తిగతంగా హత్తుకున్న ఎమోషన్‌కు పాట చేస్తున్నట్లు భావించాను. మోహన్‌లాల్‌గారి వంటి గొప్ప నటుడు ఉన్నప్పుడు ఈ ఎమోషన్ నెక్ట్స్ లెవల్‌లో ఎలివేట్ అవుతుంది. ఆయన ఈ ఎమోషన్‌కు గుండెలాంటివారు. ఆయన నటన అందరికీ స్ఫూర్తినిచ్చింది. నందగారికి ఉన్న క్లారిటీతో ఆయనకు ఎలాంటి పాట కావాలనేది నాకు సులభంగా అర్థమైంది. ఈ అప్పా.. పాట విన్నప్పుడు ప్రేక్షకులకు కూడా తండ్రి అనే బంధంలోని ఎమోషన్‌కు కనెక్ట్ అవుతారు. ఇది మేం నిర్మిస్తోన్న ప్రపంచంలోని చిన్న భాగం మాత్రమే’’ అన్నారు.
‘వృషభ’ మ్యూజికల్ జర్నీ మొదలైంది…
