‘గోదారి గట్టుపైన’ నుంచి లవ్ డ్యాన్స్ మెలోడీ చూడు చూడు సైడ్ ఎ రిలీజ్  

The most vibrant melody of love that makes your heart dance- Choodu Choodu Side A From Sumanth Prabhas, Nidhi Pradeep’s Godari Gattupaina Unveiled
Spread the love

మేమ్ ఫేమస్ తో స్ట్రాంగ్ డెబ్యు చేసిన న్యూ ఏజ్ యాక్టర్ సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ సినిమాతో అలరించబోతున్నారు. ఈ చిత్రం రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ కు ఫస్ట్ వెంచర్. ఎం.ఆర్. ప్రొడక్షన్స్ షార్ట్ ఫిల్మ్‌లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. నిధి ప్రదీప్ కథానాయికగా అరంగేట్రం చేస్తుండగా, జగపతి బాబు ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ బ్రీజ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మేకర్స్ ఫస్ట్ సింగిల్ – చూడు చూడు (సైడ్ ఎ) లిరికల్ వీడియోను విడుదల చేశారు. నాగ వంశీ కృష్ణ కంపోజ్ చేసిన ఈ సాంగ్ నదీ తీరాల సువాసనను తీసుకుని వచ్చే ఈదురుగాలిలా అనిపిస్తుంది. ప్రేమను రంగుల్తో నింపే ఈ ట్యూన్ హృదయాన్ని నాట్యం చేయిస్తుంది. ఫ్లూట్, వైలిన్, నాదస్వరంలాంటి వాద్యాలతో సంగీతానికి  సున్నితమైన క్లాసిక్‌ టచ్ ని అందించారు. హరి చరణ్ గారి వోకల్స్ ఆ పాటకి మరింత మాధుర్యాన్ని జోడిస్తే, లిరిసిస్ట్‌ దినేష్ కాకర్ల హీరో ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా సరదాగా వర్ణించారు. సుమంత్ ప్రభాస్ తన స్మూత్ డాన్స్ మూమెంట్స్‌తో ఉత్సాహం, ఉల్లాసాన్ని తీసుకువచ్చారు. హీరోయిన్ నిధి ప్రదీప్ యాటిట్యూడ్‌తో పాటు మృదుత్వాన్ని కలగలిపి మెరిసిపోయింది.  కొరియోగ్రఫీ బ్యూటీఫుల్ గా వుంది. ‘చూడు చూడు’తో ఈ సినిమా మ్యూజిక్ జర్నీ బ్లాక్ బస్టర్ నోట్ లో మొదలైయింది.  ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. ప్రవల్య ప్రొడక్షన్ డిజైనర్, అనిల్ కుమార్ పి ఎడిటర్,  నాగార్జున తాళ్లపల్లి సౌండ్ డిజైనర్. తారాగణం: సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్, జగపతి బాబు, రాజీవ్ కనకాల, లైలా, దేవి ప్రసాద్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి, వివా రాఘవ్, రోహిత్ కృష్ణ వర్మ సాంకేతిక సిబ్బంది: రచన, దర్శకత్వం – సుభాష్ చంద్ర, బ్యానర్ – రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్, నిర్మాత – అభినవ్ రావు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – మధులిక సంచన లంక, DOP – సాయి సంతోష్, సంగీతం – నాగ వంశీ కృష్ణ, ఎడిటర్ – అనిల్ కుమార్ పి, సౌండ్ డిజైనర్ – నాగార్జున తాళ్లపల్లి, ప్రొడక్షన్ డిజైనర్ – ప్రవల్య డి, పీఆర్ ఓ : వంశీ-శేఖర్, మార్కెటింగ్ : ఫస్ట్ షో

Related posts