సత్య వినుగొండ, అను శ్రీ, శీతల్ భట్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘వాషింగ్టన్ సుందర్’. యస్.యస్. మూవీ కార్పొరేషన్ బ్యానర్ పై బిపేట ప్రేమ్ కుమార్ సమర్పణలో నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సిద్ధపడుతున్నారు. సత్య వినుగొండ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి నందన్ రాజ్ బొబ్బిలి చక్కటి సంగీతాన్ని అందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి సాంగ్ ని సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్బంగా హీరో, దర్శకుడు సత్య వినుగొండ మాట్లాడుతూ.. ”చిన్నప్పుడు తన సొంత ఊరును వదిలిపెట్టి పారిపోయిన కుర్రాడు మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఆ ఊరికి ఎందుకొచ్చాడు? వచ్చిన ఆ కుర్రాడు ఆ ఊరికి ఏం చేశాడు? మళ్లీ తన సొంత ఊరును వదిలి హైదరాబాద్ కు ఎందుకు వెళ్ళిపోయాడు? అనేదే ‘వాషింగ్టన్ సుందర్’ సినిమా కథ. ఈ సినిమాకి ప్రధానంగా సంగీతం హై లైట్ కానుంది. నందన్ రాజ్ బొబ్బిలి చక్కని సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలో నటించిన చక్కటి నటీనటులు అందరూ తమా తమ పాత్రల్ని సమర్థవంతంగా పోషించారు. సినిమా ఆద్యంతం హాయిగా సాగుతూ ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఈ ‘వాషింగ్టన్ సుందర్’ పక్కాగా మాస్ తో మేళవించిన చక్కటి ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. నిర్మాణానంతర పనులన్నీ పూర్తి చేసుకొని అతిత్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది” అని తెలిపారు. ఈ సినిమాకి డీఓపీ : మధు బసిరెడ్డి – శ్రీనివాస్ విన్నకోట , ఎడిటర్ : మేనగ శ్రీను, కోరియోగ్రఫీ : గణేష్ మాస్టర్, ఫైట్స్ : నందూ, డిఐ : యమ్ బి ప్రకాష్. 5.1 కాళీఎస్.ఆర్ అశోక్, సహ నిర్మాతలు : అంజయ్య దన్నారం, జీవన్ రెడ్డి పోతులూరి. అనిల్ కుమార్ గుజ్జరి.
సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా ‘వాషింగ్టన్ సుందర్’ తొలి సాంగ్ రిలీజ్
