సాకే రామయ్య సమర్పణలో సిద్ద క్రియేషన్ బ్యానర్ లో సత్య మార్క దర్శకత్వంలో, ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మి నిర్మిస్తున్న చిత్రం ‘ప్రేమలో రెండోసారి’. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ అగ్ర నిర్మాత సి. కళ్యాణ్ చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్బంగా సి. కళ్యాణ్ మాట్లాడుతూ ‘ప్రేమలో రెండోసారి’ చిత్ర టైటిల్ చాలా బాగుంది. కొత్తగా అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు అందరికి నచ్చుతుంది. టీం అందరికి అల్ ది బెస్ట్ ఈ సినిమాని డైరెక్టర్ బాగానే తీశారు అనిపిస్తుంది. టైటిల్ లో డైరెక్టర్ ప్రతిభ స్పష్టంగా కనిపిస్తుంది, ఈ సినిమా చక్కటి ప్రేక్షకాదరణ పొందుతుందన్న నమ్మకం నాకుంది అన్నారు. ఈ టీం కి మరోసారి ఆల్ ది బెస్ట్ చెబుతున్నాన్నని అన్నారు. హీరో మరియు ప్రొడ్యూసర్ రమణ సాకే మాట్లాడుతూ.. సినిమా చాలా బాగా వచ్చింది మా డైరెక్టర్ సత్య మార్క ఈ ట్రెండ్ కి తగట్టు చాలా అద్భుతంగా సినిమాను తీర్చిదిద్దారు. ఈ సినిమా టైటిల్ ఈ కాలం ట్రెండ్ కి తగట్టుగానే ఉంది. ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా కొత్తగా ఉంటుంది. నేటి యువతీ యువకులకు బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని అందుకుంటుందన్న నమ్మకం నాలో బలంగా అంది. ఇంత మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దర్శకులు సత్య మార్క గారికి, ప్రొడ్యూసర్ సాకే నీరజ లక్ష్మీ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపునుంటున్నాను. మా హీరో కొత్త వారు అయినా చాలా బాగా నటించారు. . మా ఇద్దరి కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. సి. కల్యాణ్ సార్ బ్లెస్సింగ్స్, మీడియా సపోర్ట్ మాకు కావాలి అని కోరుకుంటున్నాం.
ఇందులో నటీ నటులు హీరో రమణ సాకే, హీరోయిన్ వనిత గౌడ, మరియు జబర్దస్త్ శ్రీను, బాబీ, దుర్గారావు, జబర్దస్త్ ఫణి, రాణి, సతీష్ సారపల్లి, చిరంజీవి, విక్టర్ తదితరులు నటించారు అని పేర్కొన్నారు.
అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ చేతుల మీదుగా ‘ప్రేమలో రెండోసారి’ ఫస్ట్ లుక్ విడుదల
