‘శాకుంతలం’ కోసం రూ.14 కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం.. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే మొదటిసారి: గుణ శేఖ‌ర్‌

‘శాకుంతలం’ కోసం రూ.14 కోట్ల విలువైన నిజమైన బంగారం, వజ్రాలను ఉపయోగించాం.. ఇలా చేయటం ఇండియాలోనే ఇదే మొదటిసారి: గుణ శేఖ‌ర్‌

ప్యాషనేట్ ఎపిక్ ఫిల్మ్ మేక‌ర్ గుణ శేఖ‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పౌరాణిక ప్రేమకథా చిత్రం ‘శాకుంతలం’. ఈ ఎపిక్ లవ్ స్టోరీలో సమంత, దేవ్ మోహన్ జంటగా నటించారు. ఈ విజువల్ వండర్ ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 14న రిలీజ్ అవుతుంది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. కాళిదాసు ర‌చించిన అభిజ్ఞాన శాకుంతలం ఆధారంగా శాకుంత‌లంను రూపొందిస్తున్నారు గుణ శేఖ‌ర్‌. శ్రీ వెంకటేశ్వ‌ర‌క క్రియేష‌న్స్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో గుణ టీమ్ వ‌ర్క్స్ బ్యానర్‌పై నీలిమ గుణ ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 3D టెక్నాల‌జీతో విజువ‌ల్ వండ‌ర్‌గా తెలుగు, హిందీ, త‌మిళ‌, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో శాకుంత‌లం సినిమా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఈ మూవీ ప్ర‌మోష‌న్స్ ప్లానింగ్ ప్ర‌కారం చ‌క చ‌కా జ‌రుగుతున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమాలో స‌మంత, దేవ్ మోహన్ లుక్‌ను ప్ర‌ముఖ…