సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తోన్న పాన్ ఇండియా మిస్టీక్ థ్రిల్లర్ విరూపాక్ష. సంయుక్తమీనన్ కథానాయిక. కార్తీక్ దండు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థలు శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఏప్రిల్ 21న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా బుధవారం నాడు సాయి ధరమ్ తేజ్ మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన విశేషాలివే.. – ఇప్పుడు కాస్త వయసు పెరిగింది. మెచ్యూరిటీ పెరిగింది. అందరినీ నవ్విస్తూ, సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను. సినిమా సక్సెస్ అయితే అందరం హ్యాపీగా ఉంటాం.…