‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి

‘లవ్ యు రామ్’ డిఫరెంట్ లవ్ స్టొరీ..అందరికీ కనెక్ట్ అవుతుంది: డైరెక్టర్ డివై చౌదరి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో దర్శక, నిర్మాత డివై చౌదరి విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు. టైటిల్ చూస్తుంటే ఇది ప్రేమకథ అని అర్థమవుతుంది.. ఇది ఏ తరహా ప్రేమ కథ ? ఇప్పటివరకూ చూసిన ప్రేమ కథలకు ‘లవ్ యు రామ్’ చాలా భిన్నంగా ఉంటుంది. ప్రేమించడమే జీవితం అని నమ్మే ఒక అమ్మాయి, నమ్మించడమే జీవితం అనుకునే అబ్బాయి మధ్య…