‘లవ్ యు రామ్’ అందరినీ అలరించే లవ్ స్టొరీ: రచయిత, నిర్మాత కె దశరధ్

‘లవ్ యు రామ్’ అందరినీ అలరించే లవ్ స్టొరీ: రచయిత, నిర్మాత కె దశరధ్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కె దశరధ్ నిర్మాతగా వ్యవహరిస్తూ కథ అందించిన చిత్రం ‘లవ్ యు రామ్’. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. రోహిత్ బెహల్, అపర్ణ జనార్దనన్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా టీజర్‌, ట్రైలర్, పాటలకు కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జూన్ 30న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో చిత్ర కథా రచయిత, నిర్మాత దశరధ్ విలేకరుల సమావేశంలో ‘లవ్ యు రామ్’ విశేషాలని పంచుకున్నారు. తొలిసారి ఈ చిత్రంలో నటించారు కదా ? నటుడిగా ఎలాంటి అనుభూతి పొందారు ? తప్పని పరిస్థితిలో నటించాల్సి వచ్చింది (నవ్వుతూ). కథ ప్రకారం ఈ సినిమా షూటింగ్ అమెరికాలో కొంత జరుగుతుంది. ముందు మేము ఇండియాలో షూట్ చేశాం. అమెరికా వీసాలు రావడం…